*త్యాగానికి ప్రతీక బక్రీద్*
*దానధర్మాలకు, త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ సందర్భంగా ప్రతి ముస్లిం సోదరులపై అల్లా ఆశీసులు మెండుగా ఉండాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆకాంక్షించారు.*
*శనివారం వారం బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్నదాంట్లోనే ఇతరులకు కొంచెం పంచిపెట్టే దాతృత్వ స్పూర్తిని బక్రీద్ చాటుతోందన్నారు.*
*దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని, బక్రీద్ పండగను భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.*