*తోడేరు ప్రజలకూ నేను శ్రేయోభిలాషినే*

*నాకు ఓట్లు రాకపోయినా నేను ఎప్పుడూ వారి మంచినే కోరుకున్నా : సోమిరెడ్డి*

*భయం..భయంగా ఇంకా ఎన్ని రోజులు బతుకుతారు..బయటకు రండి*

*కండలేరు ఎడమ కాలువకు లిఫ్ట్ ఏర్పాటు చేయించి సాగునీరు ఇవ్వడం ద్వారా తోడేరులోనూ పంటలు పండించా*

*పాతికేళ్లుగా పొదలకూరు మండలంలో పెత్తనం చేసిన గోవర్ధన్ రెడ్డి కండలేరు ఎడమ కాలువ లిఫ్ట్ ఎందుకు తేలేకపోయాడు*

*సాగునీరు ఇచ్చాను కాబట్టి నేను తోడేరుకు వచ్చి వెళ్లగానే పసుపు నీళ్లు చల్లి రోడ్లు కడుగుతారా*

*పులివెందుల, పుంగనూరుకు పోయి రాజకీయాలు చేసిన నేను తోడేరుకు రాకూడాదా*

*కాకాణి గోవర్ధన్ రెడ్డిలా నేను ఏనాడు కక్షకట్టి పింఛన్లు రద్దు చేయించలేదు. భూముల రికార్డులను మార్పించలేదు. అమాయకులపై దొంగ కేసులు పెట్టించి వేధించలేదు. ఎవరీ పొట్టా కొట్టలేదు*

*పేదలకు చేయగలిగితే సాయం చేస్తాను కానీ..చీమకు కూడా హాని తలపెట్టే మనస్తత్వం కాదు నాది*

*తోడేరు చెరువులో ఏడుగురు బిడ్డలు ప్రాణాలు కోల్పోతే ఎంత బాధపడ్డానో నాకు తెలుసు*

*నేను మనిషినే. నాకూ మానవత్వం ఉంది. అందరూ బాగుండాలని కోరుకుంటాను*

*కానీ కాకాణిలా ఎప్పుడూ కక్షసాధింపులకు మాత్రం పాల్పడను. పాల్పడలేను*

*నేను రూ.63 కోట్లు పెట్టి కండలేరు ఎడమకాలువకు లిఫ్ట్ తెస్తే ఏడాది కాలంగా కరెంట్ బిల్లు కట్టకుండా మూలనపెట్టించాడు*

*సొంత మండల రైతుల అవసరాల కోసం కరెంటు బిల్లు కట్టించలేని వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండటం దురదృష్టకరం*

*రాష్ట్రం సంగతి దేవుడెరుగు..కనీసం తోడేరు రైతులకు ఒక టారాల్పిన్ పట్ట ఇప్పించాడా..ఒక స్ప్రేయర్ ఇప్పించాడా..ఒక రొటావేటర్ ఇప్పించాడా*

*నేను వ్యవసాయ శాఖ మంత్రిగా రైతుల కోసం వివిధ పథకాలు అమలు చేయడం ద్వారా జాతీయ స్థాయిలో రికార్డులు సాధించా*

*తోడేరు అక్కచెళ్లెళ్లకు..అన్నదమ్ములకు నా విన్నపం. ఇంకా ఎంతకాలం భయపడుతారు*

*ఈ ఒక్కసారికి ఓటు వేసి ఆశీర్వదించండి..కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటా*

*పొదలకూరు మండలం తోడేరులో ఎన్నికల ప్రచారం సందర్భంగా సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed