*తెలుగు ప్రజల ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ*

*పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అందించాలన్న లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్ : టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్*

*వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మావిల్లపల్లి శ్రీనివాసులు నాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, ఇడిమేపల్లి మాజీ ఎంపిటిసి సభ్యులు చాట్ల వెంకటసుబ్బయ్య, టీడీపీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు*

*తెలుగుదేశం పార్టీ జెండాను అనుబంధ సంఘాల నేతలతో కలిసి ఆవిష్కరించిన టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్*

*స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కేక్ ను కట్ చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు*

తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం దేశ రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం

పేదవాడికి కడుపు నింపే రూ.2 రూపాయల కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇల్లు లాంటి ఎన్నో జనహిత పథకాలతో దేశంలోనే సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీయే

ఎన్టీఆర్ స్ఫూర్తిగా సీఎం చంద్రబాబు నాటి నుంచి నేటి వరకు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్న మన యువ నేత నారా లోకేష్ బాబు

ఇటు పార్టీలోనూ, అటు పాలనపరంగా విప్లవాత్మక మార్పులు తెస్తున్న మన డైనమిక్ మినిస్టర్ నారా లోకేష్ బాబు

ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు

తెలుగు రాష్ట్రాలకు ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది

గత వైసీపీ పాలకుల అవినీతి, అక్రమాలు, దోపిడీ కారణంగా అభివృద్ధిలో వెనుకబడిన సర్వేపల్లి నియోజకవర్గాన్ని తన 40 ఏళ్ల రాజకీయ చాణిక్యత ఓవైపు, మరోవైపు అనుభవంతో అభివృద్ధి, సంక్షేమానికి శ్రీకారం చుట్టిన మన ఎమ్మెల్యే సోమిరెడ్డి

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నేతలు వలిపి మునుస్వామి, బద్వేలు చెన్న కృష్ణయ్య, సండి రమేష్ యాదవ్, వెంకట కృష్ణయ్య నాయుడు, దొడ్ల అశోక్, సత్తార్ సాహెబ్, దాసి చక్రధర్, యాకల రవి, సండి రమణయ్య, మల్లి కిష్టయ్య, తాటిపర్తి వేణు, ఆస్తోటి నాగరాజు, తురక సుధాకర్, తురక రాంప్రసాద్, దొడ్డక మురళి, బత్తల సతీష్, కందుకూరు సుబ్బరాయుడు, డబ్బుగుంట సుధాకర్, తెనాలి వివేక, సురేందర్ రెడ్డి, మధు రెడ్డి, చల్లా రమణయ్య, దూడల రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed