*తెలుగు జాతి ఆత్మగౌరవం టిడిపి*

*ఆత్మకూరులో వైభవంగా మినీ మహానాడు*
*తెలుగుజాతి కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది చంద్రబాబు గారు : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*

– అనుభవం ఉన్న నాయకుడు ఆనం రామ నారాయణ రెడ్డి
– ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ ఏడాదిలో రూ.450 కోట్ల అభివృద్ధి

తెలుగు జాతి ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ అని, తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవం నుంచి తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించారన్నారు. గురువారం ఆత్మకూరులోని ఏఎంసి లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారితో కలిసి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వేదికపై నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు లో నిర్వహిస్తున్న మినీ మహానాడులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబు గారికి దక్కుతుందని. తెలుగువారు ఈరోజు ప్రపంచ స్థాయిలో రాణించగలుగుతున్నారంటే ఆయన విజన్ వల్లే సాధ్యమైందన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా పార్టీని స్థాపించారన్నారు ఆయన ఆశయాలను నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని, కార్యకర్తలే ఈ పార్టీకి బలమన్నారు. మంత్రి నారా లోకేశ్ యువనాయకత్వంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మరింత బలపడుతుందన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అనుభవం ఉన్న నాయకుడని, తన అనుభవంతో ఆత్మకూరు నియోజకవర్గంలో దాదాపు 450 కోట్ల విలువైన పనులు నిర్వహిస్తున్నారన్నారు. సోమశిల ప్రాజెక్టు దగ్గర నుంచి రోడ్లు, కాలువలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఎంపీగా కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed