*తెనాలిలో రౌడీషీటర్లకు పరామర్శా…*
*జగన్ రెడ్డిలో మార్పు ఇక అనుమానమే..*
*తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
ఏడాది క్రితం ప్రజలిచ్చిన చారిత్రక తీర్పు గుణపాఠం ఇంకా జగన్ రెడ్డి మైండ్ కి ఎక్కినట్టుగా లేదు.
సీఎం పదవికి ఎలాగూ వన్నె తేలేకపోయిన ఆయన మాజీ సీఎం గౌరవాన్ని కూడా కాపాడుకోలేకపోతున్నాడు.
తెనాలిలో రౌడీషీటర్లకు పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ ను రాష్ట్రమంతా హర్షిస్తోంది.
శాంతిభద్రతలను కాపాడేందుకు అలాగే కఠినంగా వ్యవహరించాలని కోరుకుంటోంది.
జగన్ రెడ్డి మాత్రం గంజాయి గ్యాంగును, బ్లేడ్ బ్యాచ్ ను, ఆడబిడ్డలను వేధించిన వారికి అండగా ఉంటాననడం సిగ్గుచేటు.
9 కేసుల్లో నిందితులు, రౌడీషీటర్లయిన వారిని పరామర్శించేందుకు తెనాలి వెళ్లాలనుకోవడం దుర్మార్గం.
11 సీట్లకు పరిమితమైనా రాని మార్పు ఇక భవిష్యత్తులోనూ రావడం అనుమానమే