*తుఫాన్ ప్రభావితులకు సురక్షిత ఆశ్రయం*

*77 పునరావాస కేంద్రాలలో 3,977 మందికి సురక్షిత ఆశ్రయం*

*ముందుగానే రేషన్ పంపిణీ.. తెల్ల రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోండి*

*జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా*

నెల్లూరు, అక్టోబర్ 28 : ‘మోంతా’ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కారణంగా లోతట్టు ప్రాంత వాసులకు ఇబ్బందులు లేకుండా ఎస్‌.పి‌.ఎస్‌.ఆర్‌. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 77 పునరావాస కేంద్రాలలో మొత్తం 3,977 మందికి సురక్షితంగా ఆశ్రయం కల్పించామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని నాలుగు డివిజన్ల వారిగా చూస్తే..నెల్లూరు డివిజన్‌లో33 కేంద్రాలలో 1,660 మంది, కావలి డివిజన్‌లో 28 కేంద్రాలలో 1,394 మంది, కందుకూరు డివిజన్‌లో 11 కేంద్రాలలో 748 మంది, ఆత్మకూరు డివిజన్‌లో 5 కేంద్రాలలో 175 మంది.. 77 పునరావాస కేంద్రాలలో మొత్తం 3,977 మందికి సురక్షితంగా ఆశ్రయం కల్పించామన్నారు.

ప్రతి పునరావాస కేంద్రంలో తాగునీరు, మంచి ఆహారం, చిన్న పిల్లలకు పాలు, వైద్య సేవలు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి అవసరమైన సౌకర్యాలు కల్పించామని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

*ముందుగానే రేషన్ పంపిణీ* :

‘మోంతా’ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెల్లరేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం, తదితరాలను ఈ రోజు (మంగళవారం) నుండి పంపిణీ చేస్తున్నట్లు జేసి వెంకటేశ్వర్లు మంగళవారం. ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతినెలా 1వ తేది నుండి పంపిణీ చేసేవాళ్ళమని, ఈ నెల తుఫాన్ కారణంగా ప్రజలకు నాలుగు రోజులు ముందుగానే పంపిణీ చేస్తున్నామని, కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో ఆయన తెలిపారు.

–///–//

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed