తిరుపతి,9-1-2025,గురువారం.

*తిరుపతి లో భక్తుల తోపులాట ఘటనలో టీటీడీ వైఫల్యం లేదు : చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.*

 

రాత్రంతా రైళ్లల్లో, బస్సుల్లో ప్రయాణించిన భక్తులు ఆత్రుతతో క్యూలైన్లలో నిలబడ్డారు.

అన్నం తినలేదు, టిఫిన్ తినలేదు. కనుక భక్తుల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పడిపోయింది.

షుగర్ లెవెల్స్ పడిపోయి, భక్తులు వారంతట వారే టపా టపామని కింద పడ్డారు.

పడిపోయిన భక్తుల పక్కనే ఉన్న స్థానికులు, మరీ ముఖ్యంగా తిరుపతి పెద్ద హరిజనవాడ నుంచి వచ్చిన స్థానికులు వాళ్ళ కళ్ళతో చూసి వాస్తవం చెప్పారు.

భక్తులను ఎవరూ నెట్ లేదు. వాళ్లకై వాళ్లే పడిపోయారు. ఇది చాలామందికి తెలీదు.

ఈ దుర్ఘటనకు టీటీడీ ఈవో శ్యామలారావునో, వెంకయ్య చౌదరినో, పోలీసులకు సంబంధం లేదు.

భక్తులు ఆశతో వైకుంఠ దర్శనానికి వచ్చారు. అనుకోని దుర్ఘటన వల్ల కొందరు చనిపోయారు. మరి కొంతమంది గాయపడ్డారు.

పోస్టుమార్టం చేసినా ఏం దొరకతది!?? ఇందులో టిటిడి వైఫల్యం లేనేలేదు. టీటీడీ ఉద్యోగస్తులు బాగా పని చేస్తున్నారు.

అప్రస్తుతమైనా… ఒక్క విషయం చెప్పక తప్పదు. మోడీ మోసం చేస్తున్నాడు. ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడకపోవడం తప్పు.

బిజెపి 2.5 లక్షల కోట్ల రూపాయలు విలువైన విశాఖ ఉక్కు ఆస్తులను అమ్మాలని చూస్తోంది.

చంద్రబాబు నాయుడు తిరుపతి వస్తున్నాడు. ఆయన గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను.

మోడీని చంద్రబాబు నాయుడు భలే పొగుడుతున్నాడు. పొగడ్తలు తగ్గించుకుంటే మంచిది. నిన్న ముద్దులు పెట్టుకునేంత పనిచేశారు వైజాగ్ లో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *