
*డ్రైన్ కాలువలలో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్ధాలు వేయకుండా నిరంతరం పర్యవేక్షించాలని, స్థానిక ప్రజలకు వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కల్పించాలని సూచించిన కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 11వ డివిజన్, 14వ డివిజన్ సరస్వతి నగర్, ఎన్టీఆర్ నగర్, ఏసీ నగర్ స్థూపం, ఎస్.వి.జి.ఎస్ కళాశాల పరిసర ప్రాంతాలలోని దేవుడు కాలువలో మురుగునీటి ప్రవాహాన్ని శుక్రవారం అధికారులతో కలిసి తనిఖీ చేశారు.
భారీ వర్షాల సమయంలో వరద నీరు సాఫీగా ప్రవహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా క్రమం తప్పకుండా పూడికతీత పనులను చేపట్టాలని, సిల్ట్ వ్యర్ధాలను ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని కమిషనర్ ఆదేశించారు.
డ్రైన్ కాలువలలో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్ధాలు వేయకుండా నిరంతరం పర్యవేక్షించాలని, స్థానిక ప్రజలకు వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కల్పించాలని సూచించారు.
డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులను పరిశీలించి, నిర్మాణం కొలతలను సరిపోల్చారు. భవనాలకు సంబంధించిన అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేసి పన్నుల బకాయిలు లేకుండా వసూళ్ళు పూర్తిస్థాయిలో చేయాలని రెవిన్యూ అధికారులను కమిషనర్ ఆదేశించారు.
అనంతరం స్థానిక 45వ డివిజన్ ఎస్ 2 సినిమా హాల్ ప్రాంతంలోని గుండ్లకమ్మ కాలువలో మురుగునీటి ప్రవాహం నిర్వహణను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధి కర్తం ప్రతాపరెడ్డి, నెల్లూరు నగర పాలక సంస్థ సిటీ ప్లానర్ హిమబిందు, ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ అనిల్ కుమార్, టౌన్ ప్లానింగ్ విభాగం, రెవెన్యూ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.