
*డ్రైన్ కాలువలను దాటి రోడ్లపై ఏలాంటి దుకాణాల ఏర్పాటు, నిర్మాణాలు చేపట్టరాదని, ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని నిర్వాహకులను హెచ్చరించిన కమిషనర్*
నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం స్థానిక హరనాధపురం ప్రాంతంలో పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక అన్నా క్యాంటీన్ ను అనుకొని నూతనంగా డ్రైను కాలువలపై ఏర్పాటు చేసిన టీ స్టాల్, ఫ్రూట్స్ స్టాల్స్ లను కమిషనర్ పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు.
డ్రైన్ కాలువలను దాటి రోడ్లపై ఏలాంటి దుకాణాల ఏర్పాటు, నిర్మాణాలు చేపట్టరాదని, ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని నిర్వాహకులను కమిషనర్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్మోహన్ రావు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి వేణు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.