
*డ్రైను కాలువ పనులను, మొక్కల పెంపకాన్ని కమిషనర్ పరిశీలించిన కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక మనుమసిద్ధి నగర్ ప్రాంతంలో శనివారం పర్యటించారు.
స్థానికంగా నిర్మిస్తున్న డ్రైను కాలువ పనులను, మొక్కల పెంపకాన్ని కమిషనర్ పరిశీలించి అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు.
డ్రైను కాలువలలో పూడికతీత సిల్ట్ ఎత్తివేత పనులను క్రమం తప్పకుండా నిర్వహించి వర్షాకాలంలో వరద నీరు సాఫీగా ప్రవహించేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.