డ్రీమ్ బడ్జెట్ – అభివృద్ధి పథంలో భారతదేశం
– బీజేపీ జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా రూపొందించబడిందని బీజేపీ జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్ గారు తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఇది కీలకమైన బడ్జెట్ అని ఆయన అన్నారు.
పేదలకు అండగా – మధ్యతరగతికి భరోసాగా
ఈ బడ్జెట్ పేదలు, రైతులు, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిందని చెప్పారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు 12 లక్షల వరకు పెంచడం మధ్యతరగతి వర్గానికి చాలా ఉపయోగకరమని, ఈ నిర్ణయం వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకువస్తుందని అన్నారు. అంతేకాక, MSMEలు, చిన్న పరిశ్రమల అభివృద్ధికి కేటాయింపులను 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచడం గ్రామీణ ఉపాధికి దోహదపడుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు పెద్దపీట
పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.3,295 కోట్లు, పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించడం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద దన్నుగా నిలుస్తాయని చెప్పారు. భూ రికార్డుల డిజిటలైజేషన్, విద్యా రంగానికి బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం, అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి వంటి కీలక కార్యక్రమాలకు నిధుల కేటాయింపు అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వ కట్టుబాటును సూచిస్తున్నాయని వివరించారు.
భవిష్యత్తు అభివృద్ధికి బీజం
ఈ బడ్జెట్ అభివృద్ధిని వేగవంతం చేసేలా రూపుదిద్దుకుందని, ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో దేశం వికసిత భారత్ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటుందని బీజేపీ జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్ గారు విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి పథంలో మరో కీలకమైన అడుగుగా నిలిచే ఈ బడ్జెట్‌కు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.