*డివిజన్ పరిధిలో డ్రైన్ కాలువలు, సిసి రోడ్లు, విద్యుత్ విధి దీపాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను  ఆదేశించిన కమిషనర్*

 

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు స్థానిక 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీ ప్రాంతంలో మంగళవారం పర్యటించారు.

స్థానిక ప్రజలు కలుషిత తాగునీటి సరఫరా అంశంపై అందజేసిన ఫిర్యాదును డివిజన్లోని అన్ని ప్రాంతాలలో పర్యటించి వివిధ గృహాలలో నీటి నాణ్యతను తనిఖీ చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాంతంలోని పంపు హౌస్ ను తనిఖీ చేసే నీటి నాణ్యత పరీక్షలు చేసి పరిశీలించారు. పంప్ హౌస్ వద్ద నిర్దేశించిన ప్రమాణాలు సంతృప్తికర స్థాయిలో ఉన్నాయని, పైపులైన్ సరఫరాలో నీరు కలుషితమయ్యే అవకాశాలను ఇంజనీరింగ్ విభాగం అధికారులు వెంటనే పరిశీలించాలని కమిషనర్ ఆదేశించారు.

డివిజన్ పరిధిలో డ్రైన్ కాలువలు, సిసి రోడ్లు, విద్యుత్ విధి దీపాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.

ప్రజలతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడుతూ స్థానిక సమస్యలను సంబంధిత సచివాలయం లేదా కార్పొరేషన్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారాలను పొందాలని సూచించారు. బడి వయసు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలని, మున్సిపల్ పాఠశాలల్లో అన్ని వసతులతో ఉచిత విద్యను అందిస్తున్నామని స్థానిక తల్లిదండ్రులకు కమిషనర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed