*డివిజన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కమిషనర్ పర్యవేక్షించి అధికారులకు తగిన సూచనలు జారీ చేసిన కమిషనర్ వై ఓ నందన్*

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా బుధవారం స్థానిక మినీ బైపాస్ రోడ్డు అన్నమయ్య సర్కిల్ ప్రధాన మార్గంలో అధికారులతో కలిసి పర్యటించారు.

డివిజన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కమిషనర్ పర్యవేక్షించి అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.

అనంతరం అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఎన్టీఆర్ పార్కును కమిషనర్ సందర్శించారు. పార్కులో పచ్చదనం, చిన్నపిల్లల క్రీడా పరికరాలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, మొక్కల పెంపకం, స్కేటింగ్ గ్రౌండ్, వ్యాయామ పరికరాలు, వాకింగ్ ట్రాక్ తదితర వాటిని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed