*డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టిడిపి నేతలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు.*
*… రూప్ కుమార్ యాదవ్ కు రూల్స్ తెలుసా*
*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన అధ్యక్షులు*
*..వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు నాగార్జున*
నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీ జిల్లా యువజన అధ్యక్షులు కార్పొరేటర్ *ఊటుకూరు నాగార్జున* మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు..
👉 *డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు రాజ్యాంగ విలువలను కాల రాశారని అన్నారు.*
👉 *అదేదో ఘనత సాధించినట్లుగా పాత్రికేయ సమావేశాలు నిర్వహించి.. వారేదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.*
👉 *రాజ్యాంగంలో ఏ చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచి.. మరో పార్టీకి వెళ్ళచ్చని రాసి ఉందో టిడిపి నేత రూప్ కుమార్ యాదవ్ చెప్పాలని అన్నారు.*
👉 *స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడిన కార్పొరేటర్లు.. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వ్యవహరించిన తీరును..చుసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు.*
👉 *తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై 40 మంది కార్పొరేటర్లు మీ పార్టీలో చేరారని రూప్ కుమార్ యాదవ్ అంటున్నారు.. అయితే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మీ పార్టీ బీఫామ్ తో ఎందుకు పోటీ చేయలేక పోయారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.*
👉 *ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన విప్పుకు భయపడి మాత్రమే తెలుగుదేశం పార్టీ.. బీఫామ్ ఇవ్వకుండా పోటీ చేసింది అన్న విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు.*
👉 *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి.. ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓట్లు వేసిన. వారందరూ రూప్ కుమార్ యాదవ్ తో సహా.. కార్పొరేటర్లు అందరూ చట్టం ముందు దోషులుగా నిలబడి.. అనర్హత వేటుకు గురయ్యే రోజు దగ్గర్లోనే ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.*
👉 *పార్టీ పదవుల్లో ఉండగానే.. కార్పొరేటర్ల పై అనర్హత వేటు వేయించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తుందన్నారు.*
👉 *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి.. రూప్ కుమార్ యాదవ్ మాట్లాడ్డం హాస్యాస్పదమన్నారు.*
👉 *నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రాలేదన్న విషయాన్ని రూప్ కుమార్ యాదవ్ మర్చిపోయినట్టున్నారని అన్నారు.*
👉 *మొట్టమొదటిసారిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి.. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు గెలిచి ఒక చరిత్ర సృష్టిస్తే.. దాన్ని ఓర్చుకోలేక మాట్లాడుతున్నారని అన్నారు.*
👉 *చట్టం మీద గౌరవం.. రాజ్యాంగం గురించి అవగాహన లేని రూప్ కుమార్ యాదవ్ గారు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉండడం దురదృష్టం అన్నారు.*
👉 *తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బీఫామ్ ఇచ్చి.. పోటి చేయించలేకపోయిందో అప్పుడే ఆ పార్టీ నైతికంగా ఓటమికి గురైందన్నారు.*
👉 *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో 12 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ.. ధైర్యంగా పోటీ చేసి.. నైతికంగా తాము విజయం సాధించామన్నారు.*
👉 *రాబోయే రోజుల్లో ఒక పార్టీపై గెలిచి.. రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి.. వెళ్లే వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. న్యాయస్థానాల నుంచి తీసుకురాబోయే తీర్పు గుణపాఠంగా మారనుందని తెలిపారు.*
👉 *తెలుగుదేశం పార్టీకి ఇద్దరు ఎక్స్ అఫీషయో మెంబర్లు ఉన్నప్పటికీ.. వారి చేత కనీసం ఓట్లు కూడా వేయించుకోలేదని ఎద్దేవా చేశారు.*