*డిప్యూటీ మేయర్‌గా తహసీన్‌* – అధికారికంగా ప్రకటించిన ప్రిసైడింగ్‌ అధికారి కె కార్తీక్‌ – ఓటింగ్‌ ద్వారా ఎన్నుకున్న కార్పొరేటర్లు – తహసీన్ కు ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు 41 మంది కార్పొరేటర్ల మద్దతు – వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు 12మంది కార్పొరేటర్ల మద్దతు – నెల్లూరు నగర అభివృద్ధి కోసం పనిచేస్తాను : డిప్యూటీ మేయర్‌ తహసీన్‌ – వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో 54 డివిజన్లలో మేమే గెలుస్తాం : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి – ఈ ఎన్నిక అప్రజాస్వామికం… న్యాయపరంగా కోర్టుకెళ్తాం : ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి – డిప్యూటీ మేయర్‌ తహసీన్‌కు మంత్రులు నారాయణ, ఆనం అభినందన

Byjanahushaar.com

Feb 3, 2025

పత్రికా ప్రకటన
……………….
*డిప్యూటీ మేయర్‌గా తహసీన్‌*
– అధికారికంగా ప్రకటించిన ప్రిసైడింగ్‌ అధికారి కె కార్తీక్‌
– ఓటింగ్‌ ద్వారా ఎన్నుకున్న కార్పొరేటర్లు
– తహసీన్ కు ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు 41 మంది కార్పొరేటర్ల మద్దతు
– వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు 12మంది కార్పొరేటర్ల మద్దతు
– నెల్లూరు నగర అభివృద్ధి కోసం పనిచేస్తాను : డిప్యూటీ మేయర్‌ తహసీన్‌
– వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో 54 డివిజన్లలో మేమే గెలుస్తాం : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
– ఈ ఎన్నిక అప్రజాస్వామికం… న్యాయపరంగా కోర్టుకెళ్తాం : ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి
– డిప్యూటీ మేయర్‌ తహసీన్‌కు మంత్రులు నారాయణ, ఆనం అభినందన

నెల్లూరు, ఫిబ్రవరి 1 : నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా 48వ డివిజన్‌ కార్పొరేటర్‌ సయ్యద్‌ తహసీన్‌ ఎంపికయ్యారు. ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె. కార్తీక్‌ అధ్యక్షత వహించి కార్పొరేషన్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ సమావేశం మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా షేక్‌ కరీముల్లాను కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాసయాదవ్‌, వేలూరు ఉమా మహేష్‌ ప్రతిపాదించారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా 48వ డివిజన్‌ కార్పొరేటర్‌ సయ్యద్‌ తహసీన్‌ను కార్పొరేటర్లు కరణం మంజుల, కర్తం ప్రతాప్‌రెడ్డి ప్రతిపాదించారు. ఇద్దరు అభ్యర్థులకు మద్దతుదారులు చేతులు ఎత్తి ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. కరీముల్లాకు 12 ఓట్లు రాగా తహసీన్‌ కు 41 ఓట్లు వచ్చాయి. దీంతో డిప్యూటీ మేయర్‌ గా తహసీన్‌ ఎన్నికైనట్లు ప్రిసైడిరగ్‌ అధికారి కె. కార్తీక్‌ ప్రకటించారు. ఎన్నిక ప్రక్రియలో రూరల్‌ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్‌ రూప్‌ కుమార్‌ యాదవ్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

*నెల్లూరు నగర అభివృద్ధి కోసం పనిచేస్తాను : డిప్యూటీ మేయర్‌ తహసీన్‌*
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సయ్యద్‌ తహసీన్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు అవకాశం కల్పించిన మంత్రి నారాయణ, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎన్డీఎ కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటూ నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని ఆమె చెప్పారు.

*వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో 54 డివిజన్లలో మేమే గెలుస్తాం : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి*
నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో నెల్లూరులోని 54 డివిజన్లలో మా అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకేష్‌బాబుకు గిఫ్ట్‌గా అందిస్తామని చెప్పారు. డిప్యూటీ మేయర్‌గా తహసీన్‌ను ఎన్నుకునేందుకు సహకరించిన మంత్రి నారాయణ, కూటమి నేతలు, కార్పొరేటర్లు అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

*ఈ ఎన్నిక అప్రజాస్వామికం… న్యాయపరంగా కోర్టుకెళ్తాం : ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి*
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నిక అప్రజాస్వామికమన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ ఎన్నిక జరిగిందన్నారు. రెండుసార్లు ఓటింగ్‌ నిర్వహించారన్నారు. గెలిచిన అభ్యర్థిని ఏ పార్టీ అని అడిగితే సమాధానం చెప్పలేని దుస్థితి నెలకొందన్నారు. గెలుపోటములు సహజమని, తాము ఎప్పుడూ ప్రజలతోనే వుంటామని, ఈ ఎన్నికపై పూర్తి ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.

*డిప్యూటీ మేయర్‌ తహసీన్‌కు మంత్రులు నారాయణ, ఆనం అభినందన*
నెల్లూరు నగరపాలకసంస్థ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సయ్యద్‌ తహసీన్‌ను మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి అభినందించారు. డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన అనంతరం మంత్రి నారాయణ నివాసంలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిని తహసీన్‌ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు తహసీన్‌ను ప్రత్యేకంగా అభినందించి నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిప్యూటీ మేయర్‌ తహసీన్ ను అభినందించారు.
………………………………………
జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ అధికారి, నెల్లూరు వారిచే జారీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed