*డాక్టర్స్ ఆత్మీయ సమావేశానికి హాజరైన రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*అనీల్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన డాక్టర్స్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు*
*డాక్టర్లతో ఆత్మీయ కరచలనం చేసి ఆప్యాయంగా పలకరించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్లో నగరంలో వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ డాక్టర్స్ అందరితో ఏర్పాటు చేసిన డాక్టర్స్ మీట్ & గ్రిడ్ (ఆత్మీయ సమ్మేళనము) కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిగార్లు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డాక్టర్స్ ఆత్మీయ సమావేశానికి హాజరైన ప్రముఖ వైద్యులను రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వారిదగ్గరికి వెళ్లి ఆత్మీయంగా కరచలనం చేసి ఆప్యాయంగా పలకరించారు. తమను ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలను అడిగిన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆత్మీయ సమావేశానికి హాజరైన వైద్యులు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇంతమంది ప్రముఖ వివిధ రంగాలలో వైద్య నిపుణులతో కలసి వారితో ఆత్మీయంగా గడపడం చాలా సంతోషంగా ఉందని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు.