- *సూర్య ఘర్ పథకం ప్రయోజనాలు ప్రజలలోకి అధికారులు మరియు సిబ్బంది తీసుకెళ్లాలి : – కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,*
– త్వరలో సోలార్ విద్యుత్ పై పూర్తి స్థాయిలో అవగాహనా కల్పించుటకు పెద్ద ఎత్తున కస్తూర్బా కళాక్షేత్రంలో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము
– రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది
– సామాన్య ప్రజలకు కరెంటు బిల్లు తగ్గించుకోడానికి సోలార్ సూర్యఘర్ పథకం ఎంతో ఉపయోగం
– మీరు చెల్లించవలసిన మొత్తం కు బ్యాంకు ఋణసదుపాయము ఇస్తుంది
ఈ రోజు మున్సిపల్ కమీషనర్ గారి కార్యాలయం నందు సోలార్ విద్యుత్ పై జిల్లా విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా కమీషనర్ సూర్య తేజ గారు మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగం ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు తెలిపారు. రాబోతున్న వేసవిలో వినియోగదారులకు మెరుగైన విద్యుత్ ఇవ్వడానికి ఈ సోలార్ విద్యుత్ ఎంతో అవసరమని తెలియజేశారు. ఈ సోలార్ పలకలు మీ ఇంటి పై ఏర్పాటు చేసుకున్నందు వల్ల విద్యుత్ ఉత్పత్తే కాకుండా మీ ఇండ్లు కూడా చల్లగా ఉంటుందని తెలిపారు.
ఇప్పుడు మనం బయట మార్కెట్లో యూనిట్ ధర ఎక్కువ రేటు తో కొని వినియోగదారులకు ఇస్తున్నామని అదే సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేసుకుంటే మీరు మీ ఇంటికి సరిపరా విద్యుత్ ను వాడుకుని మిగిలింది గ్రిడ్ కు పంపించవచ్చని తెలిపారు.
25 సంవత్సరాల గ్యారంటీతో ఈ సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఐదు సంవత్సరాలలో మీరు పెట్టే పెట్టుబడి మీకు పూర్తిగా వస్తుందని మిగిలిన 20 సంవత్సరాలు మీరు ఫ్రీ గా వాడుకోవచ్చు అని తెలిపారు.
త్వరలో పెద్ద ఎత్తున ఈ సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రజలకు అవగాహనా కల్పించడానికి కస్తూర్బా కళాక్షేత్రంలో సోలార్ ఎక్స్పో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అనంతరం పొదలకూరు రోడ్డు లోని సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారుని ఇంటికి వెళ్లి వారిని సోలార్ విద్యుత్ వినియోగంపై మీకు ఎటువంటి లాభాలు కలుగుతున్నాయో అని అడగడం జరిగింది. వినియోగదారుడు మాట్లాడుతూ మునుపు మాకు 1500 నుండి ₹2000 వరకు బిల్లు వస్తుంది సోలార్ వల్ల ఇప్పుడు నాకు 150 రూపాయలు వస్తుందని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమం లో సూపరింటెండింగ్ ఇంజనీర్ వి. విజయన్ గారు, నగరపాలక సంస్థ యస్.ఈ. రామమోహనరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ ఎం. శ్రీధర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అశోక్,సునీల్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.