
*టౌన్ ప్లానింగ్ విభాగం ఇచ్చిన మార్కింగ్ పరిధి దాటి డ్రైను కాలువలపై మెట్లు, ర్యాంపులు నిర్మాణాలు చేయకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించిన కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక సండే మార్కెట్ ప్రాంతంలో పట్టణ ప్రణాళిక విభాగం వారు శనివారం చేపట్టిన రోడ్డు ఆక్రమణల మార్కింగ్ పనులను పర్యవేక్షించారు.
టౌన్ ప్లానింగ్ విభాగం ఇచ్చిన మార్కింగ్ పరిధి దాటి డ్రైను కాలువలపై మెట్లు, ర్యాంపులు నిర్మాణాలు చేయకుండా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు.
నిర్దేశించిన మార్కింగ్ పరిధి దాటి చేపట్టే నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక దుకాణదారులను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రహంతూ జానీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘురాం,టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సతీష్, స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.