*టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో రోడ్డు మార్జిన్ మార్కింగ్, డ్రైన్ కాలువల మార్కింగ్ పనులను కమిషనర్ పరిశీలించి వివిధ సూచనలు జారీ చేసిన నగర కమిషనర్ వై ఓ నందన్*

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక జనార్దన్ రెడ్డి కాలనీ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు ఆక్రమణల తొలగింపు పనులను మంగళవారం పర్యవేక్షించారు.

టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో రోడ్డు మార్జిన్ మార్కింగ్, డ్రైన్ కాలువల మార్కింగ్ పనులను కమిషనర్ పరిశీలించి వివిధ సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు, కార్పొరేషన్ స్థలాలు, రోడ్లు డ్రైను కాలువలను ఆక్రమిస్తూ చేపట్టిన నిర్మాణాలను తప్పనిసరిగా కూల్చివేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, ఈ.ఈ రహంతు జానీ, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *