*టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పాలనతో రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు*
*వైసీపీ పాలనలో నాశనమైన వ్యవస్థలన్నీ తిరిగి గాడిలోకి*
*పల్లెల్లో మళ్లీ మొదలైన అభివృద్ధి…ప్రజలు, రైతుల భాగస్వామ్యంతో పారదర్శకంగా పనులు*
*పొదలకూరు మండలం తాటిపర్తిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*రూ.10 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించిన సోమిరెడ్డి…మరో రూ.15 లక్షలు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటన*
*పశు వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యాధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలకు ప్రశంస*
*సోమిరెడ్డి కామెంట్స్*
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పశు ఆరోగ్య వైద్యశిబిరాలు ప్రారంభమయ్యాయి
వైసీపీ పాలనలో మనుషులనే పట్టించుకునే దిక్కు లేదు…ఇక పశువులను ఏం పట్టించుకుంటారు
ఇప్పుడు మళ్లీ పాడి రైతులకు అండగా గోకులాలను అందుబాటులోకి తెస్తున్నాం
పొదలకూరు మండలంలో 40 గోకులాలు మంజూరు చేశాం…ఒక్కో గోకులం విలువ రూ.2.30 లక్షలు..రైతు రూ.23 వేలు కడితే చాలు..మిగతాదంతా సబ్సిడీ
సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 200కి పైగా గోకులాలు మంజూరు చేస్తున్నాం
గతంలో జీవాలకే పరిమితమైన డీవార్మింగ్ మెడిసిన్ పంపిణీని ఇప్పుడు అన్ని పశువులకు వర్తింపజేస్తున్నాం
అన్నదాతలు పంటలు పండించడమే ఎంత ముఖ్యమో…పాడి పోషణ కూడా అంతే ముఖ్యం
ప్రతి రైతు కూడా సేద్యంతో పాటు పశువులను కూడా పోషించి పాల ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది
వ్యవసాయంలో బిందు తుంపర్ల సేద్యం పరికరాల పంపిణీ కూడా తిరిగి ప్రారంభమైంది
వైసీపీ ఐదేళ్ల పాలనలో అక్రమాలు, అవినీతి తప్ప అభివృద్ధి ఊసే లేకుండా పోయింది
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవరోధాలన్నింటిని అధిగమించి పాలన క్రమేణా గాడిన పడుతోంది.
తాటిపర్తిలో ఈ రోజు రూ.10 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించుకున్నాం..త్వరలోనే మరో రూ.15 లక్షలతో పనులు చేపట్టబోతున్నాం
ఆరోగ్య శ్రీ వర్తించని చికిత్సలను ప్రైవేటు ఆస్పత్రుల్లో చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నాం
దేవుడి దయతో సోమశిల, కండలేరు జలాశయాల్లో పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉన్నాయి
వాతావరణంలో అనూహ్య మార్పుల వల్ల పంట దిగుబడిపై కొంత ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది
తాటిపర్తి పరిధిలో మూడు కాలువల పూడికతీతకు రూ.15.50 లక్షలు మంజూరు చేశాం
సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రూ.10 కోట్లతో 130కి పైగా పనులను రైతుల భాగస్వామ్యంతో చేయించాం
వైసీపీ హయాంలో రైతులకు కూడా తెలియకుండా ఆరు పనుల పేరుతో రూ.30 కోట్లు స్వాహా చేశారు…ఆ పనులు చేసినట్టు రికార్డుల్లో మాత్రమే ఉంది…క్షేత్రస్థాయిలో చూస్తే పనులు చేసిన ఊసే లేదు
కాలువల్లో పూడికతీయకుండానే బిల్లులు చేసుకోవడంతో అప్పట్లో 30 టీఎంసీలకు పైగా జలాలు వృథా అయ్యాయి
గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు, అవినీతి, అక్రమాలకు ఇప్పుడు ఆస్కారమే లేదు…ప్రతి అంశంలోనూ పారదర్శకంగా ముందుకు సాగుతున్నాం..
సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్రంలోనే ముందుంటాం