*టీడీపీ కూటమి ప్రభుత్వంలో స్థానిక సంస్థలకు మంచి రోజులు*
*సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనత వైసీపీ సర్కారుది*
*ఆర్థిక సంఘం నిధులను రాత్రికి రాత్రే దారిమళ్లించి ప్రజల కోసం పనిచేయకుండా చేశారు*
*ఈ ప్రభుత్వంలో ఎవరికీ గౌవరం తగ్గదు..వైసీపీ మద్దతుదారులు రాజకీయాలు చేయడం మాని ప్రజల కోసం పనిచేయాలి*
*నెల్లూరులో మీడియాతో ఏపీ సర్పంచ్ ల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గోపిరెడ్డి పావని, నరుకూరు ఎంపీటీసీ సభ్యులు కొణతం రఘుబాబు, సర్వేపల్లి నియోజకవర్గ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఉయ్యాల భాస్కర్, నెల్లూరు జిల్లా సర్పంచ్ ల సంఘం ఉపాధ్యక్షురాలు చిట్టేటి కవిత, కొత్తపాళెం మాజీ సర్పంచ్ చేవూరు శ్రీనివాసులు, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి గోపిరెడ్డి వెంకటేష్ యాదవ్, పార్లపల్లి సర్పంచ్ గూడూరు శ్రీనివాసులు*
కూటమి ప్రభుత్వంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం కరువైందని వైసీపీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదం
పాపం వైసీపీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు గౌరవం ఇప్పుడే గుర్తుకు వచ్చినట్టుంది
మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో అప్పటి పాలకులు, అధికారులు ఏనాడైనా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పట్టించుకున్న పాపానపోయారా
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను గౌరవమిస్తోంది
పల్లెల అభివృద్ధికి కీలకమైన ఆర్థిక సంఘం నిధులను రాత్రికి రాత్రే దారి మళ్లించిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిది
సర్పంచ్ ఖాతాలో పడిన నిధులను ఆ ప్రజాప్రతినిధి సంతకం కూడా లేకుండా దారిమల్లించిన వైసీపీ ప్రభుత్వం గురించి ఈ రోజు ఆ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతారు
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్పంచ్ ల ఖాతాలో నిధులు వేసి పల్లెల అభివృద్ధికి బాటలు వేశారు
ఉత్సవ విగ్రహాలుగా మార్చి సర్పంచ్ లకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయంపై ఎన్నో పోరాటాలు చేపట్టాం.
రద్దు చేసిన జనరల్ ఫండ్ పునరుద్ధరించమని కోరుతూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడాం…చివరకు భిక్షాటన కూడా చేశాం
ఐక్య పోరాటాలు చేద్దామని పిలిస్తే ఆనాడు ముఖం చాటేసిన వారు ఇప్పుడు గౌరవం తగ్గిందనడం విడ్డూరంగా ఉంది
టీడీపీ మద్దతుదారులతో కలిసి పోరాటాలు చేస్తే తమ ఎమ్మెల్యేలకు కోపం వస్తుందని, అర్థం చేసుకోండని ప్రాధేయపడిన సర్పంచ్ లు కూడా పలువురు ఉన్నారు
కనీసం వీధిలైటు వేయించే పరిస్థితి లేకుండా చేశారు…తాగునీటి సమస్యలు తలెత్తితే తీర్చలేకపోయాం..ఇప్పుడు మాకు మంచి రోజులొచ్చాయి
స్థానిక సంస్థల్లో వెండార్ విధానాన్ని తీసుకొచ్చిందే వైసీపీ ప్రభుత్వం.
అభివృద్ధి పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా వేధించిన చరిత్ర కూడా ఆనాటి పాలకులది
జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను ప్రజలకు ఉపయోగపడకుండా చేశారు.
పేదలతో చేయించాల్సిన పనులను మిషన్లతో చేయించారు
వైసీపీ పాలనలో పనులు చేసిన ప్రజాప్రతినిధుల్లో పలువురు బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి
ఇఫ్పుడు పనులు చేసినవి చేసినట్టు బిల్లులు మంజూరవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారికి మండల గ్రాంట్ నుంచి ఒక్క రూపాయి నిధులైనా కేటాయించారా
టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే ఎంపీటీసీ సభ్యులకు నిధుల కేటాయింపు ప్రారంభమైంది
ప్రతి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ప్రజల కోసం పనిచేస్తూ మనశ్శాంతిగా నిద్రపోతున్నారు…