*సర్వేపల్లి రాజకీయాల్లో కీలక పరిణామం*

*టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డికి మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత సీవీ శేషారెడ్డి*

*అరాచక, ఆటవిక పాలన నుంచి సర్వేపల్లి ప్రజలకు విముక్తి కల్పించేందుకే ఈ నిర్ణయం*

*సీవీ శేషారెడ్డి బాటలోనే ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కనగట్ల రఘురాం ముదిరాజ్*

*రాష్ట్రంలో ప్రభుత్వమే లేదని, క్రిమినల్ మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎండీగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ కంపెనీ పెత్తనం నడుస్తోందని ధ్వజమెత్తిన సీనియర్ కార్మిక నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య*

*సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకొచ్చిన సీనియర్ నాయకులకు ధన్యవాదములు తెలిపిన సోమిరెడ్డి*

*నెల్లూరులో మీడియాతో సీవీ శేషారెడ్డి కామెంట్స్*

సర్వేపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా

65 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి వికృత పాలనను చూడలేదు

నేను పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసినా, మరో పదేళ్లు సోమిరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగినా సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశాం

జిల్లాలోనే ఆదర్శ నియోజకవర్గంగా సర్వేపల్లిని నిలబెట్టాలని నిరంతరం శ్రమించాం. తుఫాన్లను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం కష్టపడ్డాం

బకింగ్ హాం కెనాల్ ఆవల ఉన్న మత్స్యకారులకు మెరక ప్రాంతంలో నివేన స్థలాలు కేటాయించడంతో పాటు ఇళ్లు కట్టించాం.

రోడ్ల నిర్మాణంలోనూ ముందు నిలిచాం. అభివృద్ధే లక్ష్యంగా పనిచేశాం

ఏ ఊరికి వెళ్లినా కాంగ్రెస్ హయాంలో నేను, టీడీపీ హయాంలో సోమిరెడ్డి చేసినా పనులే కనిపిస్తున్నాయి

ప్రశాంతతకు మారుపేరైన సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం నీతి, నిజాయతీ లేని ఆటవిక పాలన సాగుతోంది.

ఇసుక, గ్రావెల్, వైట్ క్వార్జ్ తదితర ప్రకృతి సంపదను దోపిడీకి గురవుతున్న నియోజకవర్గంగా సర్వేపల్లికి పేరు రావడం చాలా బాధగా ఉంది

అక్రమ మైనింగ్ పై పోరాటం చేపట్టిన సోమిరెడ్డిపై దాడి చేయడానికి హిజ్రాలను ఉసిగొల్పడం వైసీపీ పాలనలో కాకాణి గోవర్ధన్ రెడ్డి వికృత చేష్టలకు పరాకాష్ట

సర్వేపల్లి రిజర్వాయర్ తో పాటు కనుపూరు చెరువులో మట్టితవ్వకాలకు తెరలేపి నిలువుదోపిడీ చేశారు.

ఆలీబాబా 40 దొంగల్లా మారి నియోజకవర్గాన్ని దోచుకుంటుంటే ప్రజానాయకుల్లా ఎంతో బాధకు గురయ్యాం

ఓ తండ్రి తన బిడ్డ పెళ్లి కోసం ఎకరా పొలం అమ్ముకోవాలంటే మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు సమర్పించుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరం

సీఎంతో పాటు మంత్రులే మద్యం వ్యాపారం చేస్తున్నారంటే ఎంత నీచానికి దిగజారారో ప్రజలు అర్థం చేసుకోవాలి

దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనవంతుడైన జగన్మోహన్ రెడ్డి తాను పేదవాడినని, కార్పొరేట్లకు వ్యతిరేకమని చెప్పుకోవడం విడ్డూరం

జగన్మోహన్ రెడ్డికి సలహాదారులుగా ఉన్న వ్యక్తులూ దారిదోపిడీదారులే. వారిని పెట్టుకుని రూ. 10 పేదలకు ఇస్తూ మిగిలిన రూ.90 దోచుకుంటూ ప్రజాసంక్షేమాన్ని విస్మరించారు.

నా సర్వేపల్లి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఈ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ ఆటవిక పాలన, అప్రజాస్వామిక పరిస్థితుల నుంచి సర్వేపల్లి ప్రజలకు విముక్తి కల్పించేందుకు సోమిరెడ్డిగా అండగా నిలుస్తున్నాను

అరాచక పాలనను అంతమొందించడానికి కాంగ్రెస్ బలం చాలదనే ఉద్దేశంతో, ఆ పార్టీతో ఉన్న 65 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుని సోమిరెడ్డికి మద్దతు పలుకుతున్నాను.

నా మనవడు హర్షవర్ధన్ రెడ్డి యువగళం పాదయాత్రలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి పనిచేశారు.

సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాను.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా నేను, నా సహచరులు పనిచేస్తాం

*మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య కామెంట్స్*

రాష్ట్రంలో ప్రభుత్వం అనేది లేకుండా పోయింది.

ఒక క్రిమినల్ మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎండీగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ సంస్థ మాత్రమే ఉంది. ఇది ప్రభుత్వమే కాదు

వైసీపీ పాలనతో ప్రస్తుతం నెలకొన్న దారుణమైన పరిస్థితుల్లో రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న మా లాంటి వారు మౌనంగా ఉండటం మంచిదికాదనే ఉద్దేశంతో ప్రజల ముందుకొస్తున్నాం

ఇప్పుడు మౌనంగా ఉంటే ప్రజలకు ద్రోహం చేసినట్టేనని భావిస్తున్నాం

రాష్ట్రాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మే 13న జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమిని ఆశీర్వదించాలని కోరుతున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed