టీటీడీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ


తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో అనిల్ సింఘాల్ గార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. భక్తుల దర్శనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, ఒంటిమిట్టలో భక్తుల వసతి కోసం భారీ వసతి సముదాయం నిర్మాణం, అలాగే తిరుమలలో దివ్య ఔషధ వనం ఏర్పాటు, గోశాలలను అనుభవం ఉన్న సంస్థకు అప్పగించే అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో టీటీడీ బోర్డు ఇతర సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed