*టిడిపి సీనియర్ నాయకుడు చిట్టా బంగార్రెడ్డి మృతికి నివాళులు అర్పించిన ఎంపీ వేమిరెడ్డి ,ఎంఎల్ఏ నాగేశ్వరరావు*
ఉలవపాడు మండలం కరేడుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు చిట్టా బంగార్రెడ్డి మృతికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సంతాపం తెలిపారు.
శనివారం వారి ఇంటికి వెళ్లిన నేతలు.. చిత్తా బంగార్రెడ్డి మృతదేహానికి పూలమాలు వేసే నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని, బంగార్రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరారు.