టిడిపి ప్రణాళిక బద్ధంగా మైనారిటీల కోసం టిడిపి ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ బాధ్యత టిడిపి ప్రభుత్వం అబ్దుల్ అజీజ్ పై ఉంచింది.

67 వేల ఎకరాలకు గాను 32 వేల ఎకరాల వక్ఫ్ భూమి అన్యాక్రాంతమైంది.

అన్యాక్రాంతమైన భూములను చట్ట పరంగా వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తాం.

సాధ్య, అసాధ్యాలను పరిశీలించి వక్ఫ్ ఆస్తులతో సంపద సృష్టిస్తాం.

– మొహమ్మద్ అహమద్ షరీఫ్, రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు.

– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు.

నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ అహమద్ షరీఫ్, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ లు మీడియా సమావేశం నిర్వహించారు.

మోహమ్మద్ అహ్మద్ షరీఫ్ కామెంట్స్:-

టిడిపి ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతోంది.

టిడిపి హయాంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల ద్వారా జిల్లాకు 29 కోట్ల రూపాయల సహకారం అందించాం.

గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రుణం మంజూరు చేయలేదు.

మైనారిటీల కోసం టిడిపి ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకురావడానికి కసరత్తు చేస్తుంది.

వక్ఫ్ బోర్డు పాలనవర్గాన్ని నియమించుకోలేని దుస్థితిలో గత ప్రభుత్వం ఉంది.

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ బాధ్యత టిడిపి ప్రభుత్వం అబ్దుల్ అజీజ్ పై ఉంచింది.

జిల్లాలోని 2600 ఎకరాలకు గాను కేవలం 600 ఎకరాలు మిగిలి ఉంది.

టిడిపి హయాంలో నెల్లూరు జిల్లాలో 8 షాదీఖానాలు నిర్మించాం.

బాలుర రెసిడెన్షియల్ స్కూల్ కోసం టిడిపి హయాంలో 10 నుంచి 11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే అనిల్ కుమార్ యాదవ్ కుటుంబ సభ్యుడు స్థలంపై స్టే తీసుకొని వచ్చాడు.

తిరిగి వేరే స్థలంలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్ ను నిర్మించాం.

టిడిపి హయాంలో మాత్రమే మైనార్టీలకు మేలు జరిగింది. టిడిపి ఇచ్చిన మూడు అసెంబ్లీ సీట్లలో మైనారిటీలు ఘన విజయం సాధించారు.

వైసిపి ప్రభుత్వం ఏడు స్థానాల్లో నిలబెట్టినా ముస్లిం సామాజిక వర్గం సహకరించలేదంటే వైసీపీ ముస్లింలకు ఎంతటి అన్యాయం చేసిందో అందరూ గ్రహించాలి.

అబ్దుల్ అజీజ్ కామెంట్స్:-

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది.

చంద్రబాబు నాయకత్వంలో రాజధాని ఏర్పాటు అవుతుందన్న నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం కలిగించింది.

మైనార్టీలను ప్రోత్సహించే వ్యక్తి చంద్రబాబు మాత్రమే మైనార్టీలను ఆర్థికంగా విద్య పరంగా దృఢంగా చేయాలన్న సంకల్పం కట్టుకున్న వ్యక్తి చంద్రబాబు.

గత ఆరు సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డు ను నిర్వీర్యం చేశారు 67 వేల ఎకరాలకు గాను 32 వేల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది.

అన్యాక్రాంతమైన భూములను చట్ట పరంగా వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తాం.

మిగిలి ఉన్న భూములకు జియో ట్యాగింగ్ చేసి సంపద సృష్టించే చర్యలు తీసుకుంటాం.

వక్ఫ్ బోర్డు లో ఉండేవి వ్యక్తుల ఆస్తులు కాదు భగవంతుడి ఆస్తులు.

వక్ఫ్ ఆస్తులను పరిశ్రమలకు వ్యాపారాలకు 33 సంవత్సరాలు లీజుకు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం.

సాధ్య అసాధ్యాలను పరిశీలించి వక్ఫ్ ఆస్తులతో సంపదను సృష్టించి ముస్లింల సంక్షేమానికి ఉపయోగిస్తాం.

ప్రజలందరూ గర్వంగా చెప్పుకునే విధంగా వక్ఫ్ బోర్డ్ ను నిలబెడతాను.

సమావేశంలో నెల్లూరు పార్లమెంటు టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, జాఫర్ షరీఫ్, మైనుద్దీన్, సాబీర్ ఖాన్, నన్నేసాహెబ్, రియాజ్, మైజుల్లా హుస్సేని, రసూల్, అస్లాం, సుబహాన్, సిరాజ్, అష్రాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed