
*జొన్నవాడ కామాక్షిత ఈ సేవలో వేమిరెడ్డి దంపతులు*
బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వెలసిన శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారిని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి దంపతులు బుధవారం రాత్రి దర్శించుకున్నారు.
కామాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా ఆలయ అర్చకులు అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు వేమిరెడ్డి దంపతులకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం భక్తులకు వేమిరెడ్డి దంపతులు ప్రసాదాలు పంపిణీ చేశారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.