*జిల్లా స్థాయిలోనూ గిరిజనుల సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి : ఎంఎల్ఏ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*నా తొలి ప్రాధాన్యం గిరిజనుల అభ్యున్నతిపైనే*

*కనీసం ఆధార్ కార్డులు ఇప్పించకుండా సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తున్నట్లు*

*జిల్లా స్థాయిలోనూ గిరిజనుల సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి

*ముత్తుకూరు మండలం పైనాపురం పంచాయతీ చిన్నసంఘం గిరిజన కాలనీలో పర్యటన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*ఇంటింటికీ వెళ్లి గిరిజనుల సమస్యలపై ఆరా తీయడంతో పాటు మనుమళ్లతో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేసిన సోమిరెడ్డి*

*సోమిరెడ్డి కామెంట్స్*

గిరిజన బిడ్డలు కనీసం ఆధార్ కార్డులకు కూడా నోచుకోకపోవడం బాధాకరం

కనీస అవసరమైన ఆధార్ కార్డులు లేక గిరిజనులు రేషన్ కార్డులతో పాటు ఇతర సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారు

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక నేను గిరిజనుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాను

ఒక్క పైనాపురం పంచాయతీలో 70 మందికి జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయించడంతో పాటు 80 మందికి ఆధార్ కార్డులు నమోదు చేయించాం, 17 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చాం

43 మందికి అర్హత ఉన్నా ఓటు హక్కు లేదు…35 మందికి రేషన్ కార్డులు లేవు..18 మంది పింఛన్ పొందలేకపోతున్నారు

సమాజంలో ప్రత్యేకంగా గిరిజనులే అన్యాయానికి గురవుతుండటం దురదృష్టకరం

12 మంది ఉద్యోగులతో గ్రామంలోనే సచివాలయం ఉండటంతో పాటు మండల స్థాయిలో అధికారులు ఉన్నా పేదల కనీస అవసరాలు తీర్చలేకపోడం సరికాదు

గిరిజనుల అవసరాలు తీర్చలేని సచివాలయాలు ఎందుకు

జిల్లా స్థాయిలో గిరిజనులకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయడంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి

మేం ఇటీవలే సర్వేపల్లి నియోజకవర్గ స్థాయిలో గిరిజనుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాం

ఆ గ్రీవెన్స్ కార్యక్రమంలోనే వందలాది మందికి ఆధార్ కార్డులు నమోదు చేయించాం

ఆధార్ కార్డు లేక పోతే భారత పౌరుడనే ఆధారం కూడా లేని పరిస్థితి

త్వరలోనే అందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు పక్కా ఇళ్లు కట్టిస్తాం

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేయడంతో పాటు గిరిజన కాలనీల్లో ప్రత్యేక వసతులు కల్పిస్తాం

గిరిజన బిడ్డలు తప్పనిసరిగా బడికి వెళ్లడంపైనా అందరూ శ్రద్ధవహించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *