*జిల్లా సమగ్ర అభివృద్దే నాలక్ష్యం – నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి..*

మాస్టర్ ప్లాన్ పై ఆర్.వి కన్సల్టెన్సీ మరియు నూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నుడా చైర్మన్.. హాజరైన వైస్ చైర్మన్ సూర్యతేజ, నుడా అధికారులు..

– జిల్లా ప్రజల చిరకాల కోరిక.. ఆశయాలకు అనుగుణంగా నుడా ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్..

– నుడా ప్రతిష్ట పెరిగేలా గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు..

– పార్కుల అభివృద్ధి దగ్గరనుంచి నెక్లెస్ రోడ్డు నిర్మాణం దాకా అన్నీ కూడా నుడా ఆధ్వర్యంలోనే జరిగాయి..

– 38 మండలాలు.. 9616.117 చదరపు కిలోమీటర్ల మేర నుడా పరిధి విస్తరించి ఉంది.. రానున్న 25 ఏళ్ల అవసరాలను అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ రెడీ చేసాం

– మాస్టర్ ప్లాన్ ఆధారంగా రింగ్ రోడ్లు, బైపాస్ రోడ్లు, ప్రధాన నీటి సరఫరా, పార్కుల అభివృద్ధి, నిరుపేదలకు కూడా అందుబాటులో ఉండేలా లేవుట్ల ధరలు, అందులో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నాం..

– నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు కావలి మున్సిపాలిటీ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలు అలాగే 15 మండలాల్లోనే 146 గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద పీఠ..

 

 

నెల్లూరుజిల్లాను ప్రజలు ఏ విధంగా చూడాలనుకుంటున్నారో.. దానికి అనుగుణంగా. మాస్టర్ ప్లాన్ రూపొందించి.. అభివృద్ది చెయ్యబోతున్నట్లు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటి చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు.. వైస్ చైర్మన్ సూర్యతేజతో కలిసి.. నుడా అధికారులతో ఆయన సమావేశమయ్యారు.. మాష్టర్ ప్లాన్ గురించి చర్చించారు.. 2041 టార్గెట్ గా నుడా పరిధిలో ఎక్కడెక్కడ పరిశ్రమల స్థాపన, రోడ్లు, డ్రైనేజీ వంటి వసతుల కల్పనకు మాస్టర్ ప్లాన్ అవసరం ఉంటుందన్నారు.. మాస్టర్ ప్లాన్ ను రూపొందించి.. తద్వారా అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని కోటంరెడ్డి తెలిపారు.. తాను నుడా చైర్మన్ గా ఉన్నప్పుడు పార్కుల అభివృద్ధి దగ్గరనుంచి నెక్లెస్ రోడ్డు నిర్మాణం దాకా అన్నీ కూడా నుడా ఆధ్వర్యంలోనే జరిగాయన్నారు.. మరోసారి అభివృద్దే అజెండాగా పనిచెయ్యబోతున్నట్లు స్పష్టం చేశారు.. మాస్టర్ ప్లాన్ ఆధారంగా రింగ్ రోడ్లు, బైపాస్ రోడ్లు, ప్రధాన నీటి సరఫరా, పార్కుల అభివృద్ధి వంటి వాటికి పెద్ద పీటవేస్తామన్నారు.. మాస్టర్ ప్లాన్ ను త్వరితగతిన ఇవ్వమని ఇప్పటికే.. ఆర్.వి కన్సల్టెన్సీ ని కోరామన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కావలి మున్సిపాలిటీలకు సంబంధించి టార్గెట్ 2041 సంవత్సరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటికే ప్రభుత్వానికి పంపామన్నారు.. వైస్ చైర్మన్ సూర్య తేజ మాట్లాడుతూ.. తీర ప్రాంత జిల్లా కావడంతో.. దాని సమగ్ర అభివృద్దికి మాస్టర్ ప్లాన్ తయారుచేస్తున్నామన్నారు. చైర్మన్ కోటంరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ది జరుగుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో నుడా పరిధిలోని కమిషనర్లు, కార్పొరేషన్ అధికారులు, సిటీ ప్లానర్ హిమబిందు, నుడా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *