• *SPS నెల్లూరు జిల్లా*

    *జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు, నేరచరిత్ర కలిగిన నేరస్థులకు కౌన్సిలింగ్ నిర్వహించిన నెల్లూరు పోలీసు అధికారులు- జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,*

     *జిల్లాలో నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు,, నేడు ఆదివారం జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు మరియు నేరచరిత్ర గల నేరస్థులు ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో హాజరు కాగా, వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన నెల్లూరు పోలీసులు.*
     *ప్రజా శాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదు. ఎవ్వరిని ఉపేక్షించం.. పద్ధతులు మార్చుకోండి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.-జిల్లా యస్.పి. గారు హెచ్చరికలు.*
     *మహిళలు, బాలికలపై అత్యాచారాలకు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.*
     *జిల్లాలో నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించి వీటిని అరికట్టే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు.*
     *ప్రస్తుతం ప్రజలకు పలు హెల్ప్ లైన్ లు అందుబాటులో ఉన్నాయని, రౌడీయిజం చేస్తే నిముషాలలోనే పోలీసుల దృష్టికి చేరుతుందని, అందుకు తగ్గట్టుగానే పోలీసుల ప్రతి చర్యలు కూడా అదే స్థాయిలో ఉంటాయని జిల్లా యస్.పి. గారు హెచ్చరికలు జారీ చేశారు.*
     *రౌడీ, KD, DC కదలికలపై పటిష్ఠ నిఘా. ప్రజా శాంతికి ఏమాత్రం భంగం కలిగిస్తే PD-Act లు ఓపెన్ చేస్తాం.*
     *సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలి.*
     *నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపకల్పన. మారుమూల ప్రాంతాల సైతం CC కెమెరాలు ఏర్పాటు చేసాము. బీట్లు పటిష్టంగా అమలు పరుస్తున్నాము.*
     *నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలి.*
     *జిల్లాను ప్రశాంత జిల్లాగా ఉంచుతూ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసుల విధులు.*
     *గతంలో నేరాలకు పాల్పడిన ముద్దాయిలపై నిఘా పెంచాము.*
     *పోలీసుల మాటలను వినకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు..*
     *ప్రతి నేరస్తుడిపై పటిష్ఠ నిఘా నిరంతరం ఉంటుంది. నేర ప్రవర్తనను మానుకొని ప్రజలతో సహేతుకంగా మెలుగుతూ ఎవరికీ ఎటుంటి ఇబ్బంది కలిగించకుండా జీవించాలని సూచన.*
     *నేరాలకు పాల్పడి జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని హెచ్చరికలు.*
     *జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కౌన్సెలింగ్ నిర్వహించారు.*
     *అనంతరం ప్రస్తుతం వారు జీవిస్తున్న విధానం, జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై ఆరా తీశారు.*
     *మీ ప్రాంతాలలో ఏదైనా అల్లర్లు, గొడవలు జరిగితే వెంటనే సదరు సమాచారాన్ని డయల్ 112 కి గానీ, దగ్గరలోని పోలీస్ పోలీస్ స్టేషన్ వారి దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచనలు.*

    జిల్లా పోలీసు కార్యాలయం, తేది.14.12.2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed