
*SPS నెల్లూరు జిల్లా*
*జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నెల్లూరు పోలీసులు- జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,ఐపియస్.,*
జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారి సూచనలతో, జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజలతో భాగస్వాములయ్యేలా కార్యాచరణ రూపకల్పన.
జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల ఆట కట్టించుటకు ఆయా గ్రామాలలోని గ్రామస్తులు, గ్రామ పెద్దలతో మరియు యువతతో సమావేశం నిర్వహిస్తున్న నెల్లూరు పోలీసులు.
అందులో భాగంగా ఆయా పరిధిలోని గ్రామస్తులతో సమావేశం నిర్వహించి గ్రామంలోని సమస్యలు, ఆస్థి నేరాలు, నివారణ చర్యలు, సైబర్ మోసాల గురించి, గాంజా, ఇసుక అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి, మహిళలు మరియు బాలబాలికలపై జరిగే నేరాలు, ఇతర చట్టాలు, శిక్షలు గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తున్న నెల్లూరు పోలీసులు.
గ్రామాల్లో తగాదాలు, గొడవలు పడరాదని, అందరూ కలిసిమెలిసి సామరస్యంగా జీవించాలని వారికి తెలియజేయడం జరిగింది.
ఇసుక, మద్యం, గంజాయి ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణా అడ్డుకట్ట వేయడానికి గ్రామస్థులు సహకారం అందించాలని సూచన.
ఆయా పరిధిలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా. చెడునడత, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నవారికి పోలీస్ అధికారుల కౌన్సిలింగ్ నిర్వహణ.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారుల హెచ్చరిక. *ఎవరికైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కి తెలపగలరు.*
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.14.12.2025.