SPS నెల్లూరు జిల్లా

*జిల్లా వ్యాప్తంగా టోల్ ప్లాజా, హైవేలో రాత్రి పూట జరుగుతున్న ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహణ-జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,*

 జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారి సూచనల మేరకు, రోడ్డు ప్రమాదాలు నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా టోల్ ప్లాజా, హైవే, ప్రముఖ ప్రాంతాలలో పోలీసు అధికారులు రాత్రిపూట తిరిగే ట్రావెల్స్ బస్సులు, లారీలు, వ్యాన్లు మరియు ఇతర వాహనదారులను అప్రమత్తం చేస్తూ, హైవే పై వాహనాల వేగాన్ని తగ్గించడానికి ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
 రోడ్డు ప్రమాదాలు జరుగకుండా సురక్షిత ప్రయాణం కొరకు ముందస్తు చర్యలులో భాగంగా పోలీస్ అధికారులు తన సిబ్బందితో అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామున వచ్చే వాహనాలు నడిపే డ్రైవర్లను ఆపి, వారిని నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు.
 రాత్రి సమయంలో డ్రైవర్లలో నిద్ర మత్తు, అవగాహన లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు తగ్గించడం మరియు వారి భద్రతా అవగాహన పెంచడమే ప్రధాన ఉద్దేశ్యం.
 టోల్ ప్లాజా, ప్రధాన జంక్షన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద నియమించిన పోలీసు బలగాలు, రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులను ఆపి, వారికి ఫేస్ వాష్ చేయించడం జరిగింది.
 డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే, వాహనాన్ని పక్కన నిలిపి కాసేపు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం .
 రోడ్డుపై ఉన్న స్పీడ్ లిమిట్ బోర్డులను గమనించి, ఆ వేగంలోనే వెళ్లడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు. దేశంలో జరిగే 70% కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు అతివేగం వల్లే సంభవిస్తున్నాయి.
 మద్యం సేవించి వాహనాలు నడపడం ఘోర ప్రమాదాలకు దారితీస్తుంది. డ్రంకెన్ డ్రైవింగ్ పై పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు.
 మద్యం సేవించి వాహనాలు నడిపరాదని, వాహనాలు నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ప్రమాదాలు జరగకుండా నిర్దిష్ట వేగంతో గమ్యాన్ని చేరుకోవాలని, డ్రైవర్లకు సూచించారు.
 నేర నియంత్రణ, ఎటువంటి చట్టవ్యతిరేక అసాంఘీక కార్యకలాపాల గురించి సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ డయల్ 112 ద్వారా గానీ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.18.12.2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed