*జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలపై,* జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేసిన.. వెంకటగిరి సమన్వయకర్త *నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళిధర్*
—————————————-
నెల్లూరు జిల్లా కలెక్టరేట్ *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి..వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేరిగ మురళిధర్ గారు కలెక్టర్ ఆనంద్ గారిని కలిసి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మెమొరాండం అందజేశారు.*
ఈ సందర్బంగా *సైదాపురంలో అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలు, అలాగే నెల్లూరు సిటీ పరిధిలో నిబంధనలను విరుద్ధంగా యదేచ్ఛగా సాగుతున్న ఇసుక తరలింపు పై వారు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.*
*నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై.. చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని.. కలెక్టర్ గారు హామీ ఇచ్చారు.*
• *సైదాపురంలో అక్రమ మైనింగ్,కలువాయి లో పక్క రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలించడంపై జిల్లా కలెక్టర్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసామని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ తెలిపారు.*
• *చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. బినామీ పేర్లతో అవినీతి పనులు చేస్తే.. ఎప్పటికైనా వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.*
• *ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారు ఎంత పెద్ద వారైనా.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.*
• *ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని.. వారు ఖచ్చితంగా చర్యలు తీసుకొని విచారణ జరిపిస్తామని మాట ఇచ్చారని తెలిపారు.*
• *రాబోయే రోజుల్లో ఇలాంటి అక్రమాలే మళ్లీ చోటు చేసుకుంటే.. కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.*
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మాట్లాడుతూ..
👉 *కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ఇసుక, క్వార్జ్,శిలికా, మైనింగ్ ను టిడిపి నేతలు యదేచ్చగా దోచుకోవడమే పరమావధిగా మారిందన్నారు.*
👉 *వీటన్నింటిపై ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి, వెంకట నియోజకవర్గం, నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న.. అక్రమాల గురించి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.*
👉 *ముఖ్యంగా నెల్లూరు సిటీ పరిధిలోని ఇసుక రీచ్ ల నుంచి.. అర్ధరాత్రి పూట అక్రమంగా టన్నులు కొద్ది ఇసుకను టిప్పర్ల ద్వారా .. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని అన్నారు.*
👉 *వీటిని నియంత్రించేందుకు ఎవరు ప్రయత్నించిన.. రౌడీలను, గుండాలను, గంజాయి బ్యాచ్ ను ఇసుక రీచుల్లో మోహరించి..ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.*
👉 *ఇలా తెలుగుదేశం పార్టీ.. విచ్చలవిడిగా అసాంఘిక శక్తులను పెంచి పోషించి.. నెల్లూరులో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు కారణమవుతుందన్నారు.*
👉 *నెల్లూరులో గడిచిన రెండు నెలల్లోనే 20 కి పైగా మర్డర్లు జరిగాయి అంటే .. వీరు పెంచి పోషిస్తున్న అసాంఘిక శక్తులే దీనికి కారణం అన్నారు.*
👉 *క్షణికావేశంలో హత్యలు చేసే స్థాయికి యువత వచ్చారంటే దీనికి మద్యం మత్తు, గంజాయే కారణమన్నారు.*
👉 *ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు జిల్లా నుంచి – కిరాయి హంతకులు నెల్లూరులో దొరికే పరిస్థితి తలెత్తడానికి.. రౌడీల్ని, గుండాలను పెంచి పోషిస్తున్న నేతలే కారణం అన్నారు.*
👉 *ఇలా విపరీతంగా హత్యలకు పాల్పడుతున్న వారికి.. నేతలే అండగా నిలుస్తుంటే.. ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు.*
👉 *మహిళలు అర్ధరాత్రి నిర్భయంగా రోడ్లపై తిరిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్రం .. కానీ ఈ రోజు.. పట్టపగలే మన బిడ్డలు రోడ్లపై తిరగాలంటే.. భయపడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు.*
👉 *అసాంఘిక శక్తుల ఆట కట్టించేలా చర్యలు చేపట్టాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్.. చూస్తూ మౌనంగా ఉండిపోతుందన్నారు.*
👉 *ప్రతిపక్ష నాయకుల ఇల్లు, వారి ఆస్తులు ధ్వంసం చేయడంలో చూపించే.. ఆసక్తి.. అధికారులు ప్రజలకు సేవ చేయడంలో చూపించడం లేదన్నారు.*
👉 *కలెక్టర్ గారికి ఇచ్చిన ఫిర్యాదుల్లో.. ఇసుక రీచ్ ల్లో జెసిబిలు పెట్టి పెద్ద పెద్ద గుంతలు తవ్వి.. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కి కారణమవుతున్నారన్న విషయాన్ని తెలియజేశామన్నారు.*
👉 *మన ఇసుకను అక్రమంగా.. ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకోవడం పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.*
👉 *వీటన్నిటిపై కలెక్టర్ గారు సమగ్ర విచారణ జరిపి.. చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తమకు ఉందన్నారు.*
👉 *రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అక్రమాలపై.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందన్నారు.*
👉 *ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించిన సామాన్యుడి పక్షాన వైఎస్ఆర్సిపి నిలబడుతుందని తెలియజేశారు.*
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.