
*SPS నెల్లూరు జిల్లా*
*జిల్లాలోని WMSK/GMSK లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి,IPS., మరియు జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,*
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లాలోని పోలీసు అధికారులు, WMSK/GMSK లతో జిల్లా యస్.పి. గారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన గుంటూరు రేంజ్ ఐజి గారు.
మారుమూల గ్రామలలో సైతం సమస్యలను తెలుసుకోవడానికి పోలీసు డిపార్టుమెంటుకు ప్రజలకు మధ్య వారధి WMSK/GMSK లు.
ఆయా పరిధిలో పోలీసులకు సంబంధించిన స్థానిక సమస్యల గురించి, అవసరమైన ప్రాంతాలలో CCTV కెమెరాలు, గంజా సేవించేవారు, అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా, అసాంఘీక కార్యకలాపాలు తదితర విషయాలను తెలిపాలని సూచించారు.
కాలేజీలు, స్కూలు విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలు, సైబర్ నేరాల గురించి ప్రొఫెసర్స్ లేదా స్థానిక కౌన్సిలర్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు. మిస్సింగ్ కీసులు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూన, ఈవ్ టీజింగ్ ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు.
అదేవిధంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మహిళా చట్టాల పట్ల, శక్తి యాప్, సోషల్ మీడియాలపై, ప్రజలకు సఖి కౌన్సెలింగ్ కేంద్రం, ఓపెన్ డ్రింకింగ్, పోక్సో కేసులు నివారణ చర్యలను వివరించాలని తెలిపారు.
మహిళల భధ్రతకు చేయాల్సిన కృషి, తీసుకోవాల్సిన చర్యలు గురించి వారికి PPT ద్వారా దిశానిర్ధేశం.
పోలీసు శాఖకు గ్రామాలలో మీరే పదునైన ఆయుధం.. మీదే కీలక పాత్ర
మహిళలు, బాలలు, వృద్దులపై నేరాలు జరుగకుండా ముందస్తు చర్యలతో అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
బాగా పని చేసి వారిని గుర్తించి ఆయా వివరాలను మీ సర్వీస్ బుక్ నందు నమోదు చేస్తామని, మీ సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకుంటామని, ఎటువంటి సమస్యలు ఉన్నా ఎప్పుడైనా కలవచ్చని తెలిపారు.
ఈ కాన్ఫరెన్స్ నందు IG గారితో పాటు జిల్లా యస్.పి. గారు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి CH.సౌజన్య గారు, రూరల్ DSP శ్రీ జి. శ్రీనివాసరావు గారు, ఇతర పోలీసు అధికారులు, WMSK/GMSK లు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం, తేదీ.10.12.2025.