*SPS నెల్లూరు జిల్లా*

*జిల్లాలోని హైవేలోని బ్లాక్ స్పాట్స్, టోల్ ప్లాజాల వద్ద నాకా బంది నిర్వహించిన నెల్లూరు పోలీసులు-జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,*

 జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా, వాహనాల తనిఖీని తీవ్రతరం చేసి, గాంజా సేవించడం, నిల్వ, అమ్మకాలు, రౌడీయిజం, దౌర్జన్యాలు, దోపిడీ, దొంగతనాల నిర్మూలించాలని, అసాంఘీక కార్యకలాపాలు అడ్డుకట్ట వేయుటకు నాకా బంది నిర్వహించాలని ఆదేశించిన యస్.పి. గారు.
 జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారి సూచనల మేరకు, 13.12.25 న సాయంత్రం 06.00 గంటల నుండి రాత్రి 08.00 గంట వరకు హైవే పాయింట్స్, టోల్ ప్లాజాలు, కూడళ్ళలో నాకా బంది నిర్వహించి, విస్తృతంగా తనిఖీ చేపట్టిన నెల్లూరు పోలీసులు.
 తేది.13.12.25 న వాహనాలు తనిఖీ చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్ 25 కేసులు, ఓవర్ స్పీట్/రాష్ డ్రైవింగ్-7 కేసులు, MV యాక్ట్ కేసులు 97 నమోదు, Rs.89,990/- ఫైన్ విధించారు.
 రౌడీ షీటర్లు మరియు అనుమానాస్పద వ్యక్తుల చర్యలపై నిఘా తీవ్రతరం చేయాలని, అర్ధరాత్రి వేళలో ప్రత్యేకంగా టౌన్ పరిధిలో రౌడీయిజం, దౌర్జన్యాలను నిర్మూలనకు వాహనాల తనిఖీ చేపట్టి సమగ్ర చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసిన యస్.పి. గారు.
 జిల్లా ప్రజలకు భద్రత, భరోసా పెంపొందించడం మరియు రాత్రి సమయాల్లో రోడ్లపై శాంతిభద్రతలు నెలకొల్పడం లక్ష్యంగా జిల్లా పోలీసులు సమగ్ర చర్యలు చేపడుతున్న యస్.పి. గారు.
 ప్రజలు సురక్షితంగా మరియు శాంతియుతంగా నిద్రించేలా చూడడమే పోలీసుల ప్రధాన లక్ష్యం.
 క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షిస్తూ, ఓపెన్ డ్రింకింగ్, పేకాట, గంజాయి సేవించే మరియు వ్యాపారులను అరికట్టుట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ప్రాంతాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరిగింది.
 ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు గురించి గానీ, రౌడీయిజం గురించి గానీ సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు గానీ, డయల్ 112 కు గానీ తెలియచేయాలని ప్రజలకు సూచన. ప్రజల సహకారంతో మాత్రమే పూర్తి స్థాయి నేర నియంత్రణ సాధ్యమవుతుంది.

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.13.12.2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed