
SPS నెల్లూరు జిల్లా
*జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు–2026 లో భాగంగా వాకథాన్ నిర్వహించిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS.,*
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు–2026 లో భాగంగా “శిక్షణతో భద్రత – సాంకేతికత ద్వారా పరివర్తన” స్లోగాన్తో రోడ్డు సేఫ్టీపై VRC సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు వాకథాన్ నిర్వహించిన ప్రజలకు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించిన జిల్లా గారు
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించేందుకు అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, వాహనాల సాంకేతిక లోపాలు ప్రధాన కారణాలుగా గుర్తించామని వెల్లడించారు.
ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని, అందులోను హెల్మెట్ ధరించని వారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని యస్.పి. గారు ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు భద్రతను ఒక నిబంధనగా కాకుండా మన జీవన విధానంలో భాగంగా అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
ప్రయాణానికి బయలుదేరే ముందు మీతో పాటు మీ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలని, ఇంట్లో మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారని భావించి బాధ్యతగా వాహనం నడపాలని తెలిపారు.
ప్రయాణించేటపుడు వాహన స్థితి (బ్రేకులు, లైట్లు, టైర్లు) తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ నియమాలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ అమలు చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని, ప్రతి ఒక్కరూ స్వీయ బాధ్యతతో నియమాలు పాటించాలని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో పోలీసు శాఖతో పాటు R&B, NHAI, RTC, మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ రాజ్ తదితర శాఖల సమన్వయం కీలకమని తెలిపారు.
జిల్లాలో జిల్లా రహదారి భద్రతా కమిటీ (DRSC) సమావేశాలు తరచుగా నిర్వహిస్తూ, ప్రమాదాల కారణాలపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ప్రతి ప్రమాదాన్ని సాంకేతికంగా విశ్లేషించి, రోడ్డు లోపాలు, సంకేతాల లోపాలు, ఇంజినీరింగ్ సమస్యలను సరిదిద్దే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రోడ్డు భద్రతపై ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని యస్.పి. గారు చెప్పారు.
ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని, నెల్లూరు జిల్లా ప్రజలంతా పోలీసు శాఖకు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈ వాకథాన్ కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి CH.సౌజన్యగారు, నెల్లూరు టౌన్ ASP శ్రీమతి దీక్ష,IPS., గారు, నెల్లూరు మున్సిపల్ కమీషనర్ శ్రీ నందన్ గారు, DTC శ్రీ చంధర్, RTC DM శ్రీమతి కరిమున్నీసా, రూరల్ DSP శ్రీ ఘట్టమనేని శ్రీనివాసరావు, DTC DSP శ్రీ గిరిధర్ రావు, RTO శ్రీ మదని, నెల్లూరు అపోలో యూనిట్ హెడ్ డా.బిందు భార్గవ్ రెడ్డి, ట్రాఫిక్ పోలీసులు, టౌన్ & రూరల్ పోలీసులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.24.01.2026.