
*జాతీయ గ్రంధాలయ వారోత్సవాల ను పుర స్కరించుకొని విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం , నెల్లూరు నందు డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ కేంద్ర గ్రంధాలయ విభాగం తరపున పుస్తక ప్రదర్శన : ఉప కులపతి ఆచార్య అల్లం శ్రీనివాస రావు*
జాతీయ గ్రంధాలయ వారోత్సవాల ను పుర స్కరించుకొని విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం , నెల్లూరు నందు డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ కేంద్ర గ్రంధాలయ విభాగం తరపున పుస్తక ప్రదర్శన నిర్వహించారు .
ఈ కార్యక్రమానికి విశ్వ విద్యాలయ ఉప కులపతి ఆచార్య అల్లం శ్రీనివాస రావు గారు ముఖ్య అతిధిగా విచ్చేసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాన్ని కనీసం రోజులో ఒక గంట పాటు వినియోగించుకోవాలని , మరియు మొబైల్ రీడింగ్ కన్నా పుస్తకాలని చదివితే ఎలాంటి కంటి సమస్యలు రావని తెలిపారు .
ఈ కార్య క్రమంలో రిజిస్ట్రార్ Dr . కే.సునీత , కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్యా ch . విజయ , DOA డైరెక్టర్ డాక్టర్ ఏం . హనుమ రెడ్డి పాల్గొన్నారు .
ఈ ప్రదర్శన లో విజ్ఞాన సర్వస్వములు , నిఘంటువులు , వివిధ భాషలు , విషయాలకు సంబంధించిన గ్రంధాలు , పలు రకాల పోటీ పరీక్షల సాధన కు ఉపయోగపడు పుస్తకాలు ఉన్నాయి . కేంద్ర గ్రంధాలయ అధికారిణి డాక్టర్ వై సుధారాణి విచ్చేసిన విద్యార్థులు కు గ్రంథాలయాన్ని తరచుగా వినియోగించుకోవలసిందిగా సూచించారు