*జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి రెండేళ్ల B.Ed కోర్సుకు బదులు 1 ఏడాది B.Ed కోర్సు ప్రతిపాదించిందా?  : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(NCTE) రెండేళ్ల B.Edకు బదులుగా ఒక సంవత్సరం బిఎడ్‌ కోర్సును ప్రతిపాదించింది వాస్తవమేనా అని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి  ప్రశ్నించారు.

ఈ మేరకు సోమవారం ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఆయన లోక్‌సభలో దీనిపై పలు ప్రశ్నలు వేశారు. 2014 లో 1 సంవత్సరం బి.ఎడ్. కోర్సును ఆపివేసి ఇప్పుడు తిరిగి ప్రారంభించడానికి గల కారణాలు ఆరా తీశారు. బి.ఎడ్. కోర్సును అందించే సంస్థలు 2028 నాటికి బహుళ విభాగ సంస్థలుగా మారాలన్న ప్రతిపాదన ఉందా అని వివరాలు కోరారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్‌ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. జాతీయ విద్యా విధానం(NEP), 2020 ప్రకారం..4 సంవత్సరాల మల్టీడిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీలకు సమానమైన కోర్సు పూర్తి చేసిన లేదా ఏదొక స్పెషాలిటీలో మాస్టర్స్ డిగ్రీ పొందిన, లేదా ఆ స్పెషాలిటీలో సబ్జెక్ట్ టీచర్ కావాలనుకునే ఉపాధ్యాయ విద్యార్థుల కోసం 1 సంవత్సరం B.Ed ప్రవేశపెట్టడం తప్పనిసరి అన్నారు. NEP – 2020 ప్రకారం, NCTE నిబంధనలు, 2025 పేరుతో నిబంధనలు & ప్రమాణాలను రూపొందించిందన్నారు.

వీటిని 20.02.2025న నాటి పబ్లిక్ నోటీసు ద్వారా పబ్లిక్ డొమైన్‌లో ఉంచినట్లు వివరించారు. NEP 2020 నిర్దేశించిన ప్రకారం, NCTE నిబంధనలు- 2025 ముసాయిదాలో పేర్కొన్న విధంగా B.Ed. అందించే సంస్థలు 2028 నాటికి బహుళ విభాగ సంస్థలుగా మారాల్సి ఉందన్నారు. NCTE నిబంధనలు, 2025 ముసాయిదా దశలో ఉన్నందున ఇప్పటివరకు ఇనిస్టిట్యూషన్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించలేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *