*జాతీయ ఆయుష్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎన్ని యోగా వెల్‌నెస్‌ కేంద్రాలు కేటాయించారో తెలియజేయoడి :  నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

 

*ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన యోగా వెల్‌నెస్‌ సెంటర్లు ఎన్ని.?*

జాతీయ ఆయుష్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎన్ని యోగా వెల్‌నెస్‌ కేంద్రాలు కేటాయించారో తెలియజేయాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. లోక్ సభలో శుక్రవారం ఈ మేరకు ఈ అంశంపై ప్రశ్నించారు. 2014-15 నుంచి 2019-20 మధ్య రాష్ట్రానికి 50కి పైగా యోగా వెల్నెస్ సెంటర్లు ఆమోదించబడినది వాస్తవమేనా అని ఆరా తీశారు. అలాగే 2020-21 నుంచి 2024-25 మధ్య ఆమోదించబడిన యోగా వెల్నెస్ కేంద్రాల వివరాలు కోరారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నలకు కేంద్ర ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రతిపాదనల ప్రకారం 2014-15 నుంచి 2019-20 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ ఆయుష్ మిషన్ కింద 13 యోగా వెల్నెస్ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
అదే విధంగా 2020-21 నుంచి 2024-25 మధ్య 45 యూనిట్ల యోగా వెల్నెస్ సెంటర్లు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినట్లు వివరించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన ప్రకారం ఫిబ్రవరి 2025 నాటికి 13 యోగా వెల్నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed