*జరగబోయే ఎన్నికల్లో ప్రజలే బటన్ నొక్కి జగన్ కి బుద్ధి చెప్తారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి*
నగరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 13న జరగనున్న ఎన్నికలలో సైకో పరిపాలనకు స్వస్తి పలుకుతూ సైకిల్ పాలనకు ప్రజలు స్వాగతం పలకడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కొరవడిందని స్పష్టంగా తెలుస్తుందన్నారు, పోలీస్ వ్యవస్థలో సమర్థవంతమైన అధికారులు ఉన్నారని వైకాపా ప్రభుత్వం వారి చేతులను కట్టేస్తు చట్టాన్ని వైయస్ జగన్ తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వైయస్ జగన్ బటన్ నొక్కి అభివృద్ధి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదం అన్నారు అదే బటన్ నొక్కి మే 13న పోలింగ్ బూత్లో వైఎస్సార్సీపీకి అపజయాని కలిగించి వైఎస్ జగన్ ఇంటికి పంపించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోకి వేసుకున్న అన్నారు రాష్ట్రాన్ని అవినీతి అరాచక అంధకార ఆంధ్ర ప్రదేశ్ నీ చేశారని అదేవిధంగా గత ప్రభుత్వంలో 3.3లక్షల కోట్లు అప్పులను జగన్ ప్రభుత్వం వచ్చాక 12 లక్షల కోట్లు అయిందని సగటున ఒక వ్యక్తి పైన 2.5 లక్షల రుణభారం మోపారని , జగన్ సక్సెస్ఫుల్ సీఎం అని చెప్పుకుంటున్నారని కానీ ఆయన కేవలం స్టిక్కర్ల సీఎంగా మిగిలిపోయారని, ప్రజలను ఓటు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డి కోల్పోయారని అదేవిధంగా
తులసి వనంలాంటి తిరుపతి క్షేత్రం నీ గంజాయి వనంగా మార్చిన ఘనత జగన్ కే దక్కుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు.
రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ కూటమి అని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్సీ పెంచలయ్య ,నరసింహనాయుడు, ప్రధాన కార్యదర్శులు, జీ .విజయ్,ఎై.రాజేష్, యశ్వంత్ సింగ్, నెల్లూరు రూరల్ కన్వీనర్ ఈశ్వరయ్య, ఓబిసి మొర్చ జోనల్ ఇంచార్జ్ ముక్కు రాధాకృష్ణ, జిల్లా కార్యదర్శులు, పరశురాం ,చిలకా ప్రవీణ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి గంజం పెంచల ప్రసాద్, మోర్చ అధ్యక్షులు యాకసిరి ఫణి రాజు, అశోక్, మండల అధ్యక్షుడు వెంకటేష్, బీజై యం జనరల్ సెక్రెటరీ నవీన్, కడిమి వెంకట శేషయ్య, సోషల్ మీడియా కన్వీనర్ ముని సురేష్ , లోకేష్,తదితరులు పాల్గొన్నారు.