జనతా ఫౌండేషన్ చైర్మన్ దాసరి ప్రసాద్ చేతుల మీదుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డికి ఘన సత్కారం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గా రెండవసారి ఎన్నికైన శిపారెడ్డి వంశీధర్ రెడ్డిని జనతా ఫౌండేషన్ చైర్మన్ దాసరి ప్రసాద్ శనివారం , బిజెపి జిల్లా కార్యాలయంలో,ఘనంగా సత్కరించారు. పార్టీ అభివృద్ధికి, జిల్లాలో బీజేపీ బలోపేతానికి వంశీధర్ రెడ్డి అందిస్తున్న విశేష సేవలను గౌరవిస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దాసరి ప్రసాద్ మాట్లాడుతూ, వంశీధర్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ జిల్లాలో కొత్త శక్తిని సంతరించుకుని, గ్రామ స్థాయి వరకు పటిష్టమైన విధంగా ఎదుగుతోందని కొనియాడారు. ఆయన అంకితభావం, కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకత్వం పార్టీకి ఎనలేని దోహదం చేస్తున్నాయని ప్రశంసించారు.
ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించడంతో పాటు , పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన చూపిస్తున్న కృషి ప్రశంసనీయం అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రముఖులు, కార్యకర్తలు, జనతా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. పార్టీకి తన జీవితాన్ని అంకితం చేసిన వంశీధర్ రెడ్డి వంటి నాయకులను సత్కరించడం ద్వారా పార్టీ కార్యకర్తలందరికీ నూతన ఉత్తేజం కలుగుతుందని కార్యక్రమంలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.
జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ, తనకు లభించిన గౌరవానికి ఫౌండేషన్ చైర్మన్ దాసరి ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. “పార్టీ బలోపేతానికి ఇంకా ఎక్కువ కృషి చేస్తాను. ప్రజలకు న్యాయం చేయడమే నా ముఖ్య లక్ష్యం” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జనతాఫౌండేషన్ సభ్యులు పులి.మనోజ్, నర్సింహ చావల,బి.రాజా,ఆదిత్య ప్రిన్సిపాల్ ఎస్.అంకయ్య, ఆదిత్య , శ్రీనివాసులు ,చైతన్య, మధు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.