*జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమం*
కల్లూరు పల్లి గ్రామపంచాయతీ పరిధిలో సంచార జాతులు నివసించేటువంటి ప్రాంతంలో జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడ నివసించేటువంటి పిల్లలు మరియు పెద్దలు కు అందరికీ కూడా బట్టలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనతా ఫౌండేషన్ ఫౌండర్ దాసరి ప్రసాద్ మరియు వారి మిత్రబృందం చేతుల మీదుగా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సొంత గ్రామాలను వదిలిపెట్టి ఇక్కడ జీవన భృతి కోసం విచ్చేసినటువంటి సంచార జాతుల కుటుంబాలకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం చాలా ఆనందంగా ఉందని , గతంలో కూడా వీరందరికీ కరోనా సమయంలో జనతా ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాల నిర్వహించిందని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జనతా ఫౌండేషన్ నాయకులు పోలిచెర్ల నరేంద్ర, విక్రమ సింహపురి యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి. వెంకటసుబ్బారెడ్డి ,మనోజ్ రవి,సందీప్,శ్రీకాంత్, మదన్ మస్తాన్ బాబు,నిరంజన్, రాజశేఖర్ ,శివ,తదితరులు పాల్గొన్నారు.