*జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి*
*వైసిపి ప్రభుత్వంల మాది మాటలు ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం*
అన్ని శాఖల అధికారులతో కలెక్టరేట్లో మంత్రి నారాయణ రివ్యూ…
జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కే కార్తీక్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆర్డిఓ వంశీకృష్ణ పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
మంత్రి నారాయణ కామెంట్స్….
అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రజలపై ఒక్క పైసా భారం వెయ్యం…
జగన్మోహన్ రెడ్డి మాటలు వింతగా ఉన్నాయి
ఆయన మాటలు ప్రజలు నమ్మొద్దు
వైసిపి ప్రభుత్వంల మాది మాటలు ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం..
జగన్మోహన్ రెడ్డికి ఏ వ్యవస్థ మీద అవగాహన లేదు..
అంతర్జాతీయ ప్రమాణాలతో 5 వేల, ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి 64 వేల కోట్ల ఖర్చు చేస్తున్నాం
ఇందులో ప్రజల కట్టే టాక్స్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునే ప్రసక్తే లేదు..
సీఎం ఆదేశాలతో అమరావతి నిర్మాణానికి ఫైనాన్షియల్ గా చాలా చక్కటి ప్రణాళికలు సిద్ధం చేశాం
సాక్షి పత్రికలో కోర్టు జడ్జిల భవనాల నిర్మాణానికి రూ.10 వేలు చ.అడుగుఅని తప్పుడు రాతలు రాశారు. కావాల్సింది రూ.4,600 మాత్రమే
ప్రతిదీ ఎస్ ఎస్ ఆర్ రేట్ల ప్రకారమే టెండర్లు పిలుస్తున్నాం.
హట్కో, వరల్డ్ బ్యాంక్ , ఏడిబి 15 ఫైనాన్స్ కమిషన్ తదితర సంస్థల నుంచి అప్పుగా ఆర్థిక వనరులు పుష్కలంగా వస్తున్నాయి.
నెల్లూరులో అన్ని శాఖల అధికారులతో మాట్లాడా
పెన్నా బ్రిడ్జి నిర్వాసితుల కు కొందరికి టీడ్కో ఇల్లు మరికొందరికి రెండు సెంట్లు స్థలమిచ్చాం
ఎన్నికల ముందు వైసిపి ప్రభుత్వం ప్రజలకు దొంగ పట్టాలిచ్చింది
వాటిపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమగ్రంగా చర్చిస్తున్నాం
ఎలాంటి న్యాయపరమైన సమస్యలు లేకుంటే వాటిని అందరికీ అంది ఎలా చర్యలు తీసుకుంటాం.
నెల్లూరులోని 54 డివిజన్లో అందరికీ పట్టాలు అందేలా చూస్తాం
నేనే వస్తా నేనే ఇస్త, ఒక్కొక్కటిగా పూర్తి చేస్తా
నెల్లూరు నగరంలో బీసీ భవన్ అంబేద్కర్ భవన్ కాపు భవన్ లకు గత వైసిపి ప్రభుత్వం శంకుస్థాపన చేసి ఐదేళ్లుగా పట్టించుకోలా
ఆయా భవన్ నిర్మాణాలను నేను పూర్తి చేసి చూపిస్తా
జగన్మోహన్ రెడ్డి మాది బీసీల ప్రభుత్వమని, ఎస్సీ ఎస్టీల ప్రభుత్వమని ముసలి కన్నీరు కార్చారు
ఆయా భవనాలను ఎందుకు పూర్తి చేయలేదు ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలి.
నెల్లూరు దోమల రోహిత నగరంగా మార్చేందుకు త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొస్తా
రామిరెడ్డి కాలువ ఉయ్యాల కాల్వ వంటి వాటికి పైకప్పులు పూర్తి చేసి దోమలు రాకుండా చూస్తా
2014 -నెల్లూరులో 100 పార్కులను అభివృద్ధి చేసాం
వాటిని పట్టించుకోక పరికరాలన్నీ తుప్పుపట్టి మూలన పడ్డాయి
వి ఆర్ హై స్కూల్ ను వచ్చే విద్యా సంవత్సరం నుండి మళ్లీ ప్రారంభిస్తాం
అత్యాధునిక హంగులతో విఆర్ హై స్కూల్ ను తిరిగి ప్రారంభిస్తాం
అందుకు అవసరమైన పనులు ఈనెల 15 నుండి ప్రారంభిస్తాం
మాది మాటల ప్రభుత్వము కాదు చేతల ప్రభుత్వమని నిరూపిస్తాం