*జగన్ బెయిల్ ని వెంటనే బెయిల్ రద్దు చెయ్యండి – నుడా చైర్మన్ కోటంరెడ్డి సూచన..*

*అల్లర్లు సృష్టించేందుకే పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు..*

*చావును అడ్డంపెట్టుకుని రాప్తాడులో బలప్రదర్శన చేసిన నీచుడు జగన్.. : నుడా చైర్మన్ కోటంరెడ్డి*

పోలీసులను కించపరుస్తూ.. శాంతిభద్రతలను విఘాతం కల్గించేలా జగన్ మాట్లాడుతున్నారు.

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్న జగన్ బెయిలు రద్దు చేసి జైల్లో పెట్టాలి.

16 నెలలు జైల్లో ఉండి.. 11ఏళ్లుగా బెయిలు పై బైట ఉంటున్న జగన్ రాష్ట్రంలో అసాంగీక కార్యకలాపాలకు పాల్పడుతున్న జగన్ బెయిలు రద్దు చేయాలి.

బెయిలు పై బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి తన బెదిరింపులతో సాక్షులను ఇండైరెక్ట్ గా బెదిరిస్తునట్టే ఉంది.

హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ విరిగిపోయింది అనేది డ్రామా.. ముందు అనుకున్న షెడ్యూల్
ప్రకారమే రోడ్డు మార్గంలో జగన్ వెళ్ళాడు..

పోలీసులు లేకపోతే బాత్ రూమ్ కు కూడా వెళ్లలేని జగన్.. వారిపైనే బెదిరింపులకు దిగడం సిగ్గుచేటు..

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ పై వెంటనే కేసు నమోదు చెయ్యాలి

ఎదురుతిరిగిన వారిని చంపడం తప్ప.. పోలీసుల త్యాగాలు జగన్ కు తెలీవు..

ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో జగన్ ప్యాక్షన్ తరహా రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారు.

రాష్టంలో అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి జనాల్లో తిరిగితే.. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రమాదముందని వెంటనే ఆయన బెయిల్ రద్దు చెయ్యాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 16 నెలల జైలులో ఉండి.. 11 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి.. రాజకీయ లబ్ది కోసం రాయలసీమలో ప్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నాడని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించి.. తద్వారా రాజకీయ లబ్ది పొందాలని జగన్ చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చావును అడ్డంపెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి.. రాప్తాడులో బలప్రదర్శన చేశాడని విమర్శించారు. పోలీసులను బట్టలూడదీసి కొడతానంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ పై కేసు నమోదు చేసి.. బెయిల్ రద్దు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. బెయిలు పై బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి తన బెదిరింపులతో సాక్షులను ఇండైరెక్ట్ గా బెదిరిస్తునట్టే ఉందన్నారు.. హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ విరిగిపోయింది అనేది డ్రామా అని.. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఆయన రోడ్డు మార్గంలో బెంగుళూరు వెళ్లారన్నారు. ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో జగన్ మరోసారి ప్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నాడని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో
మామిడాల మధు, పిట్టి సత్య నాగేశ్వర రావు , కువ్వారపు బాలాజీ అంచూరి శ్రీనివాసులు నాయుడు, తంబి సుజన్ కుమార్, షేక్ జహీర్, కమతం ప్రశాంత్ కుమార్,గంగవరం నాని, కొకు మహేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed