
“జగన్ పాలన చీకటి కాలం – రాష్ట్ర ప్రజలు విస్మరిస్తున్నారు!”
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు
“జగన్కు శేషజీవితం కొబ్బరి బోండాలు నరకడానికే!”
“వైసీపీ పాలనలో అవినీతి, అరాచకం రాజ్యం: భాను ప్రకాశ్ రెడ్డి”
“పోలీసులను రాజకీయ సేవకులుగా మార్చారు – ప్రజలు భయాందోళనలోకి”
“నూతన శిఖరాలకు ఆంధ్రప్రదేశ్ – బీజేపీ కూటమితో అభివృద్ధి హామీ”
– రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్న మోడీ ప్రభుత్వం-
నెల్లూరు: నెల్లూరు నగరంలోని, రామ్మూర్తి నగర్ లోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశానికి బిజెపి జిల్లా అధ్యక్షులు సిపారెడ్డి వంశీధర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా టీటీడీ బోర్డు మెంబర్ మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జీవితాంతం కొబ్బరి బోండాలు నరికే దానికి ,పరోటా పిండి పిసికే దానికే మీ శేష జీవితం దానికే సరిపోతుందని ఆయన అన్నారు.ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి పాలన రాష్ట్రానికి చీకటి రోజులను తీసుకొచ్చిందని, ప్రజలు ఆయన నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన మండిపడ్డారు.జగన్ మోహన్ రెడ్డి రాజకీయ విధానాలు, నాయకత్వ లోపాలు రాష్ట్రానికి తీరని నష్టాన్ని కలిగించాయని ఆయన దుయ్యబట్టారు.”గత ఐదేళ్లలో జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అవినీతి, అరాచకాలకు నిలయంగా మారిందనీ,ప్రజలు తమ గుండెల్లో స్థానాన్ని కోల్పోయిన నాయకుడిగా జగన్ను చూస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి, అవినీతి రాజ్యమేలిందని” అని భాను ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.”గత ఐదేళ్లలో జగన్ ప్రజల గుండెల్లో స్థానాన్ని కోల్పోయారు. ఆయన రాజకీయ విధానాలు ప్రజలకు అన్యాయమే చేశాయి. ప్రజలు ఆయన నాయకత్వాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు” అని భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. “పోలీసులను రాజకీయ సేవకులుగా మార్చేశారు. ప్రజలకు కాకుండా అధికార పార్టీకి సేవ చేసే ధోరణి పెరిగింది. ఇది సాధారణ ప్రజలకు భయాన్ని కలిగిస్తూ, రౌడీ మనస్తత్వాలను పెంచుతోంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు చెడు దారిన పడ్డాయని, చేసిన ప్రచారాలు రాష్ట్ర స్థిరత్వాన్ని దెబ్బతీశాయని చెప్పారు.జగన్ చుట్టూ ఉన్న నమ్మిన నేతలు, అధికారులు దూరమవుతున్నారు. రాజకీయ పరిణామాల్లో ఆయన ఒంటరిగా పోరాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇది పార్టీ బలహీనతకు దారితీస్తుంది” అని భాను ప్రకాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.”గతంలో జరిగిన శాంతి భద్రతలను కలవరపెట్టే చర్యలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రజలలో అనిశ్చితి, ఆందోళనలు పెరిగాయి, ఆంధ్రప్రదేశ్ శాంతిని దెబ్బతీసింది” అని ఆయన విమర్శించారు.
నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరియు తమ కూటమి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, శాంతిని తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు.”కేంద్ర పాలక శాఖతో సమన్వయంగా పనిచేస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఉంది. రూరల్, పోర్ట్, రోడ్డు కనెక్టివిటీ సహా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలు అందుబాటులోకి రావడం, పోర్టుల అభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి సృష్టిస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.”రౌడీ సాంస్కృతికి,అంతిమంగా చరమగీతం పాడతాం. చట్టాన్ని గట్టిగా అమలు చేయడం ద్వారా ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా చూస్తాం” అని భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. జగన్ రెడ్డి, వైసీపీ పార్టీలో ఉన్న అనేక అనుమానాస్పద వ్యవహారాలపై సంబంధిత అధికారులతో సహా అడుగడుగునా సక్రమ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. “వెలుగులోకి తీసుకురావాల్సిన అంశాలు ప్రజల ముందు ఉంచుతాం” అని అన్నారు.
“జగన్ రెడ్డి తన విధానాలను సరిదిద్దుకోకపోతే రాజకీయంగా వైఫల్యం ఎదుర్కొంటారని ప్రభుత్వం ప్రజల మద్దతుతో అభివృద్ధి పనులకు శ్రద్ధ చూపుతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి అనుభవజ్ఞుల సహకారంతో రాష్ట్రం నూతన శిఖరాలను అధిరోహిస్తుంది” అని భాను ప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నరసింహనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి లు యారబోలు రాజేష్, యశ్వంత్ సింగ్, జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్, నెల్లూరు రూరల్ కన్వీనర్ మండ్ల ఈశ్వరయ్య, ఓబిసి మోర్చా జోనల్ ఇంచార్జ్ ముక్కు రాధాకృష్ణ గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రసాద్, మండల అధ్యక్షులు మింగా కిరణ్ ,మదన్ సాయిరెడ్డి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ముని సురేష్, బిజెపి సీనియర్ నాయకులు హరినాథ్ రెడ్డి, నారాయణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.