
*జగన్ ఆదేశాలతో, మాజీ మంత్రుల నేతృత్వంలో వైసీపీ అల్లరి మూకలు ABN కార్యాలయం పై దాడులకు తెగబడ్డాయి. : ఎమ్మెల్సీ బీద. రవిచంద్ర యాదవ్ ,టిడిపి జిల్లా అధ్యక్షుడు*
అమరావతి అభివృద్ధిని జగన్ ఓర్వలేకపోతున్నారు, అమరావతిపై వారి వైఖరిని ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారు.
ABN కార్యాలయం పై పైశాచికంగా దాడి చేసి, పత్రికా స్వేచ్ఛను , ప్రజాస్వామ్యంను వైసీపీ మూకలు అపహాస్యం చేశాయి.
వైసీపీ మూకల దాడులకు ABN బెదరదు. నిజాలు నిర్భయంగా, వాస్తవాలను సూటిగా చెప్పగలిగే దమ్మున్న ఛానల్ ABN.
“మావిగన్” పిచ్చి ప్రతిపాదనతో, రాష్ట్ర రాజకీయాల్లో వినోదాన్ని పండిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.
అధికారం లో ఉన్నా..ప్రతిపక్షం లో ఉన్నా, తమను ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం వైసీపీ కి అలవాటుగా మారింది.
అధికారం కోల్పోయినా, కనీసం ప్రతిపక్ష హోదా దక్కకపోయినా వైసీపీ అధినేత తీరు మాత్రం మారలేదు.
ABN కార్యాలయం పై జరిగిన దాడి ని ఖండిస్తున్నాను. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
*- బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు.