*జగన్నాథ రథయాత్రకు విపిఆర్‌ దంపతుల విరాళం*

– 6 లక్షల చెక్కును అందించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

హరే కృష్ణ మంత్ర ప్రచారమే లక్ష్యంగా నెల్లూరు ఇస్కాన్‌ సంస్థ చేపట్టనున్న 13వ జగన్నాథ రథయాత్రకు నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ తమ దాతృత్వాన్ని చాటారు. ఈ నెల 31న నెల్లూరు నగరంలో జరగనున్న జగన్నాథ రథయాత్రకు రూ.6 లక్షల చెక్కును బుధవారం విపిఆర్‌ నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఇస్కాన్‌ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి ఎంపీ వేమిరెడ్డి దంపతులు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. విపిఆర్‌ దంపతులు ఇస్కాన్‌ రథయాత్రకు తమవంతు సంపూర్ణ మద్దతు అందించారని ఇస్కాన్‌ ప్రతినిధులు తెలిపారు. రథయాత్ర సందర్భంగా ప్రతి ఏటా 6 లక్షల ఆర్థిక సహాయం అందించి భక్తుల కొరకు ప్రత్యేక భోజన వసతి కల్పిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా విపిఆర్‌ దంపతులకు సంస్థ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ జగన్నాథ స్వామివారి ఆశీసులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 31న మధ్యాహ్నం 2.30 గంటలకు కలెక్టరేట్‌ ఆఫీసు సమీపంలో ప్రారంభం కానున్న రథయాత్ర.. సాయంత్రం 7 గంటలకు టిటిడి కల్యాణ మండపం వరకు సాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed