*జగనన్న సంక్షేమ పథకాలు, నాన్నగారి అభివృద్ధి కార్యక్రమాలే వైసీపీకి విజయ సోపానాలు — ఆదాల హిమబిందు*

*26, 27వ డివిజన్లలో రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాలకు మద్దత్తుగా ఆయన కుమార్తె ఆదాల హిమబిందు ఎన్నికల ప్రచారం*

*ఆదాలకు బ్రహ్మరథం పడుతున్న రూరల్ ప్రజలు*

గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అవినీతికి చోటు లేకుండా పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు, కేవలం 9 నెలల సమయంలో రూరల్ ఇన్చార్జిగా నాన్నగారు, వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి రూ.150 కోట్ల నిధులతో పూర్తి చేసిన అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయ సోపానాలు అవుతున్నాయని ఆదాల హిమబిందు పేర్కొన్నారు. ప్రతి ఇంటికి జగనన్న సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరిందని, ప్రతి డివిజన్, గ్రామాలలో నాన్నగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ ఎదుటే కనబడుతున్నాయని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆదాల హిమబిందు తెలియజేశారు. గడిచిన 40 రోజులకు పైబడి తాను నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నానని, *ఏ గడపకు వెళ్ళిన సంక్షేమ పథకం లబ్ధి అందిందని, ఈ రోడ్డు మీ నాన్నగారు వేశారు.. ఈ డ్రైన్ మీ నాన్నగారి కట్టించారు..ఈ అభివృద్ధి కార్యక్రమం మీ నాన్నగారు చేశారని ప్రజలే స్వచ్ఛందంగా చెబుతున్నారని* ఆదాల హిమబిందు చెప్పారు. బుధవారం రూరల్ నియోజకవర్గం లోని 26, 27వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి దిశ నిర్దేశంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిగార్లకు మద్దతుగా ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వైస్సార్సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆదాల హిమబిందుకు స్థానిక వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు, యువకులు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజలందరు ఈనెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిగార్లకు *ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి* అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆదాల హిమబిందు స్థానిక ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పార్టీ అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, 26, 27వ డివిజన్ల ఇన్చార్జిలు షేక్ బాబు, సన్నపురెడ్డి వెంకటసుబ్బారెడ్డి, యువ నాయకులు కొండ్రెడ్డి భరత్ కుమార్, నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీ సునంద, నగర పార్టీ ఉపాధ్యక్షులు వేలూరు శ్రీధర్ రెడ్డి, క్లస్టర్ -1అధ్యక్షులు ముడియాల రామిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ సూరిబాబు, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు ముంగమూరు భార్గవి రెడ్డి, 26, 27వ డివిజన్లో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed