*జగనన్న సంక్షేమం ద్వారా అందరికీ ప్రయోజనం — ఆదాల హిమబిందు*
*1వ డివిజన్లో వైఎస్ఆర్సిపి శ్రేణులు, ప్రజలు, మహిళలు, యువకులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆదాల హిమబిందు*
*మళ్లీ గెలిచింది జగనే… రూరల్ లో విజయ దుందుభి మ్రోగించేది నాన్నగారే — ఆదాల హిమబిందు*
*ఏ గడపకి వెళ్లిన మా ఓటు వైసీపీకే అంటున్న ప్రజలు — ఆదాల హిమబిందు*
*ఇంటింటా ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆదాల హిమబిందుకు ఘనస్వాగతం పలికిన వైఎస్ఆర్సిపి నాయకులు, ప్రజలు, మహిళలు*
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ల పరిపాలనలో ప్రజలకు అందించిన సంక్షేమం ద్వారా ప్రతి గడపకు లబ్ధి చేకూరిందని నెల్లూరు రూరల్ వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కుమార్తె ఆదాల హిమబిందు చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ తిరిగి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని, నెల్లూరు నియోజకవర్గంలో నాన్నగారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయ దుందుభి మ్రోగించడం ఖాయమని ఆదాల హిమబిందు మీడియాకు తెలిపారు. ప్రజల మనసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం రూరల్ నియోజకవర్గం లోని 1వ డివిజన్లో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజలు, మహిళలతో కలిసి వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గార్లకు మద్దత్తుగా ఆదాల హిమబిందు ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా సంక్షేమ లబ్ధి వివరాలు తెలుసుకున్నారు. సీఎం జగనన్న హాయ్ కొత్తంలో తమకు అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని ప్రజలు వివరించడం, రూరల్ నియోజకవర్గంలో రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అతితక్కువ కాలంలో 150 కోట్ల రూపాయల పైబడి నిధులతో అభివృద్ధి చేయడం వంటి అంశాలను ప్రజలు స్వయంగా వివరిస్తూ రానున్న ఎన్నికల్లో తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దత్తు అందించి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయడం జరుగుతుందని బహిరంగంగా చెప్పడం చాలా గర్వంగా ఉందని ఆదాల హిమబిందు తెలిపారు. వైసిపి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయానికి మద్దత్తుగా *నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి దిశనిర్దేశంలో* ఆదాల హిమబిందు ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఇంటింటా ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆదాయంలో స్థానిక నాయకులు, ప్రజలు మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ నారాయణరెడ్డి పేటలో ఆ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ లేబూరు పరమేశ్వర రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు వాల్మెటీ లక్ష్మీ నారాయణరెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ ఒట్టూరు సుధాకర్ యాదవ్, నాపా సుబ్బారావు, వాల్మెటీ సుధాకర్ రెడ్డి, మౌలా, నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీ సునంద, ఏపీ స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ పాశం శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షులు వేలూరు శ్రీధర్ రెడ్డి, కల్లూరు లక్ష్మిరెడ్డి, నండూరి హరితరెడ్డి, ముంగమూరు భార్గవిరెడ్డి, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.