*జగనన్న ఇల్లులు కట్టకుండానే వైసీపీ నేతలు భారీగా మెక్కేశారు*
*కాంట్రాక్టర్ అవతారమెత్తి మరీ దోచేసిన అనికేపల్లి వైసీపీ నేత*
*ఇల్లులు కట్టకుండానే రూ.కోటి 95 లక్షలు స్వాహా*
*జగనన్న కాలనీలలో లెవెలింగ్ పేరిట భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు*
*వెంకటాచలం ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం అనికేపల్లి, గొలగమూడి టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎంపిడిఓ కల్పన గారికి వినతి పత్రాన్ని అందజేసిన టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్*
గత వైసీపీ ప్రభుత్వంలో అనికేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జగనన్న కాలనీలో కింద 244 పక్కా ఇల్లు మంజూరయ్యాయి
ఇల్లులు పూర్తికాకుండానే, కొన్ని ఇళ్లకు బేస్మెంట్లు కూడా కట్టకుండానే వైసీపీ నేతలు రూ.కోటి 95 లక్షలు బిల్లులు డ్రా చేసుకొని స్వాహా చేసేశారు
వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు, అప్పటి అధికారులు కుమ్మక్కై ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునే పేదవాడికి సరఫరా చేసే ఇసుక, స్టీల్, సిమెంట్ లను అందకుండా మధ్యలోనే నొక్కేశారు
విజిలెన్స్ ఎంక్వైరీ వేయించి నిజానిజాలను నిగ్గు తేల్చి మెక్కేసిన ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసి పేదవాడికి మంజూరైన ఇళ్లను పూర్తిగా నిర్మించి ఇవ్వండి
మేక్కేసిన సొమ్మును రికవరీ చేసి అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి
క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చిన ఎంపిడిఓ
ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి షేక్ సత్తార్ సాహెబ్, టిడిపి నేతలు చెమికల కిష్టయ్య, కాకి నిరంజన్, షేక్ మౌలాలి, గుండెబోయిన వెంకటేశ్వర్లు, చెమికల పుట్టయ్య, షేక్ మస్తాన్ మరియు అనికేపల్లి, గొలగమూడి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.