పథకం ప్రకారమే దాడి – జగనన్నపై దాడికి ఓటుతో సమాధానం చెప్పాలి : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
రాష్ట్రంలో ఐదేళ్ల పాటు జనరంజక పాలన అందించి ప్రజలందరితో మమేకమయ్యేందుకు మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్రలో వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిపై జరిగిన సంఘటనకు మే 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో ప్రజలు సమాధానం చెప్పాలని, ఇప్పుడు ఎవరూ కూడా సంయమనం కోల్పోవద్దని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.సమాధానం
ఆదివారం ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం కోసం తొలి నుంచి తెలుగుదేశం పార్టీ వారి నాయకులను, కార్యకర్తలను దాడులు చేయమని, రెచ్చగొట్టే విధంగా మాట్లాడమని, అవాస్తవాలు ప్రచారం చేయమని చెబుతూనే ఉన్నారన్నారు.
గత సంవత్సరాల కాలంగా టీడీపీ, జనసనే నాయకులు తమ పచ్చమీడియా ఛానెళ్ల ద్వారా, సామాజిక మధ్యమాల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ప్రతిపక్షాలను విమర్శలు చేస్తూ వస్తున్నారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి జరిగిన దాడిపై కూడా ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
సానుభూతి కోసం ఇలాంటి అకృత్యాలు చేయాల్సిన అగత్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ప్రజలే గమనిస్తే జరిగిన దాడిలో ఒక్క అంగుళం కింద తగిలి ఉన్న కన్ను పోయేందని, పక్కకు తగిలి ఉంటే ప్రాణమే పోయేదని, దీనిని బట్టి చూస్తే విసిరిన రాయి బయట నుంచి మాత్రమే వచ్చిందన్న విషయం స్పష్టమవుతుందని అన్నారు.
ప్రజలందరికి సంక్షేమాన్ని అందించారు కాబట్టే ఆ దేవుడి దయతో ప్రజలందరికి ఆశీర్వాదంతో జగన్ననకు ఏం జరగలేదని, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి తొందరపాటు పనులు చేయకుండా ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ దీనిపై అవసరమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని అన్నారు.
గతంలో 151 స్థానాల్లో గెలిపించిన ప్రజలు సంక్షేమ పాలనను చూశారని, ఈ దఫా జరిగే ఎన్నికల్లో అంతకు మించి ఫలితాన్ని తప్పక ఇస్తారని నమ్మకంగా చెబుతున్నామని, వైఎస్సార్సీపీ సంక్షేమ ప్రభుత్వం తప్పకుండా ప్రజలకు సేవ చేస్తుందని ఎమ్మెల్యే మేకపాటి పేర్కొన్నారు.